Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాత్రి పూట కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు: డీజీపీ

అమరావతి: రాత్రి పూట కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో కరోనాపై పుకార్లు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే వారిపై ఉక్కుపాదం పోపుతామని తెలిపారు. రెమ్‌డెసివిర్ నిల్వలు-వినియోగం, ఆక్సిజన్ నిల్వలు-వినియోగం.. ఫీజుల పేరిట దోపిడీ తదితర అంశాలపై నిరంతర నిఘా పెడుతామని డీజీపీ పేర్కొన్నారు. పోలీసులు, విజిలెన్స్, ఎన్‌ఫోర్ప్‌మెంట్‌, డ్రగ్ కంట్రోల్.. మెడికల్, హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తామని తెలిపారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నట్టు సమాచారం ఉంటే 100కు, 1902కు డయల్ చేయాలని ఆయన సూచించారు. కొవిడ్ రోగుల నుంచి ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజులపై ఆరా తీస్తున్నామన్నారు. పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్ వాహనాలకు రవాణా పరమైన ఇబ్బందులు కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామన్నారు. గ్రీన్ ఛానల్‌ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి నోడల్ అధికారులను నియమించామని, ఇతర శాఖలతో సమన్వయానికి కొవిడ్ కంట్రోల్ రూంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను నియామించామని సవాంగ్ చెప్పారు.


Advertisement
Advertisement