రాత్రి 9 గంటల వరకు పార్కులు

ABN , First Publish Date - 2022-04-21T16:28:23+05:30 IST

నగరంలో ఎండలను దృష్టిలో ఉంచుకొని తెల్లవారుజామున 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పార్కులు తెరచి ఉంచాలని అధికారులకు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఉత్తర్వులు

రాత్రి 9 గంటల వరకు పార్కులు

ఐసిఎఫ్‌(చెన్నై): నగరంలో ఎండలను దృష్టిలో ఉంచుకొని తెల్లవారుజామున 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పార్కులు తెరచి ఉంచాలని అధికారులకు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. మనలి పుదునగర్‌కు చెందిన వినోద్‌కుమార్‌ కార్పొరేషన్‌ 2వ మండలంలో ఉన్న పార్కుల వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు పార్కుల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్‌ అధికారులకు పంపి న ఉత్తర్వుల్లో కార్పొరేషన్‌ పరిధిలోని పార్క్‌లను 5 నుంచి రాత్రి 9 వరకు తెరచి ఉంచాలని పేర్కొన్నారు.


Updated Date - 2022-04-21T16:28:23+05:30 IST