NRIనంటూ మాట కలిపిన యువకుడు.. చివరికి అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టిన యువతి!

ABN , First Publish Date - 2022-05-19T00:33:29+05:30 IST

మ్యాట్రిమోని సైట్లో యువతిని పరిచయం చేసుకుని, పెళ్లి చేసకుంటానని నమ్మించి రూ.లక్షలను దోచుకున్న నైజీరియన్ సైబర్ నేరగాడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ యువ

NRIనంటూ మాట కలిపిన యువకుడు.. చివరికి అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టిన యువతి!

హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్లో యువతిని పరిచయం చేసుకుని, పెళ్లి చేసకుంటానని నమ్మించి రూ.లక్షలను దోచుకున్న నైజీరియన్ సైబర్ నేరగాడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ యువతి మ్యాట్రిమోని సైట్లో వివరాలు అప్‌లోడ్ చేసింది. ఆమె ప్రొఫైల్‌ను చూసిన అమరా ఫన్నీ సంప్రదించాడు. తాను ఎన్నారైనని, అమెరికాలో ఉంటున్నానని సంప్రదించాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆమెతో స్నేహం చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు ఫోన్ చేశారు. అమెరికా నుంచి అమరా ఫన్నీ రూ. కోట్ల విలువైన కరెన్సీ, బంగారం తెచ్చాడని, యాంటీ టెర్రరిజం క్లియరెన్స్, డ్రగ్స్ క్లియరెన్స్, ఇంటర్నేషనల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల కోసం కొంత నగదు చెల్లించాలని చెప్పారు. సదరు యువతి వారు చెప్పిన విధంగా రూ.10లక్షల నగదు పంపింది. ఎంతకూ క్లియరెన్స్ కాకపోవడం, ఇంకా డబ్బుులు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆ యువతి రాచకొండ సైబర్ క్రైంను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడ్ని గుర్తించారు. నైజీరియా ముఠా ఢిల్లీలో ఉంటూ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అమరా ఫన్నీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2022-05-19T00:33:29+05:30 IST