కీలక మద్దతు స్థాయి 10000

ABN , First Publish Date - 2020-06-29T06:14:44+05:30 IST

నిఫ్టీ 10550 వరకు వెళ్లి రియాక్షన్‌లో పడింది. కాని 10200 వద్ద రికవరీతో చివరికి 140 పాయింట్ల లాభంలో ముగిసింది. గత వారంలో కన్సాలిడేషన్‌, సైడ్‌వేస్‌ ధోరణిలో కదలాడి కీలక స్థాయి 10300 సమీపంలో అప్రమత్తంగా ముగిసింది...

కీలక మద్దతు స్థాయి 10000

నిఫ్టీ 10550 వరకు వెళ్లి రియాక్షన్‌లో పడింది. కాని 10200 వద్ద రికవరీతో చివరికి 140 పాయింట్ల లాభంలో ముగిసింది. గత వారంలో కన్సాలిడేషన్‌, సైడ్‌వేస్‌ ధోరణిలో కదలాడి కీలక స్థాయి 10300 సమీపంలో అప్రమత్తంగా ముగిసింది. అలాగే వారం కనిష్ఠ, గరిష్ఠ స్థాయిల నడుమన ముగియడం ట్రెండ్‌లో అనిశ్చితి సంకేతం. అప్‌ట్రెండ్‌ కొనసాగించాలంటే ఈ వారంలో కూడా బలంగా నిలదొక్కుకోవడం అవసరం. టెక్నికల్‌గా మార్కెట్‌ అప్‌ట్రెండ్‌లోనే ఉన్నా 10550-10600 స్థాయిలో బలమైన నిరోధం ఎదురవుతోంది. ఇదే స్వల్పకాలిక, మధ్యకాలిక నిరోధ స్థాయి కావడం వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. 


గత కొద్ది వారాల ర్యాలీ అనంతరం ఈ నిరోధ స్థాయిల్లో అప్రమత్త వైఖరికే ఆస్కారం అధికంగా ఉంది. స్వల్పకాలిక ఓవర్‌ బాట్‌ స్థితి ఏర్పడుతూ ఉండడం కూడా గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలనేందుకు సూచన. గత శుక్రవారం అమెరికా మార్కెట్లలో బలమైన రియాక్షన్‌ ఏర్పడడం వల్ల సోమవారం రియాక్షన్‌ ఎదురు కావచ్చు. ఈ రియాక్షన్‌లో కూడా 10300 కన్నా పైన నిలదొక్కుకోవడం అవశ్యం. 

బుల్లిష్‌ స్థాయిలు : 10300 వద్ద కనీసం రెండు రోజుల పాటు బలంగా క్లోజయితే ట్రెండ్‌లో సానుకూలతకు ఆస్కారం ఉంది. ప్రధాన నిరోధ స్థాయి 10550 -10600. ఈ స్థాయిల్లో నిలదొక్కుకుంటే ఆ పైన ప్రధాన నిరోధం 10700. 

బేరిష్‌ స్థాయిలు : మద్దతు స్థాయి 10150 కన్నా దిగజారితే మరింత బలహీనపడవచ్చు. కీలక మద్దతు స్థాయి 10000. ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక కరెక్షన్‌ ఏర్పడవచ్చు. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

బ్యాంక్‌ నిఫ్టీ : ఈ సూచికి ప్రధాన నిరోధం 22000. మూడోసారి ఈ స్థాయిలో ఎదురవుతున్న పరీక్షలో బ్రేకౌట్‌ సాధించినప్పుడే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కొనసాగుతుంది. 

పాటర్న్‌ : 10550 వద్ద ‘‘ఏటవాలుగా ఎగువకు ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధం ఎదురవుతోంది. అక్కడ బ్రేకౌట్‌ తప్పనిసరి. 10000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌ ‘‘ఏటవాలుగా ఎగువకు ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన ఉంది. 

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం సోమ, గురు వారాల్లో తదుపరి రివర్సల్స్‌ ఉన్నాయి. 


సోమవారం స్థాయిలు

నిరోధం : 10310, 10360  

మద్దతు : 10240, 10190

Updated Date - 2020-06-29T06:14:44+05:30 IST