15000 స్థాయిలో కీలక పరీక్ష -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2021-04-12T06:05:29+05:30 IST

నిఫ్టీ గత వారంలో బలమైన రియాక్షన్‌లో ప్రారంభమైనా 14500 వద్ద కోలుకుని కీలక మానసిక అవధి 15000 వరకు వెళ్లింది. చివరికి 14834 వద్ద వారం గరిష్ఠ స్థాయిల్లో ముగియడం పాజిటివ్‌ కన్సాలిడేషన్...

15000 స్థాయిలో కీలక పరీక్ష  -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారంలో బలమైన రియాక్షన్‌లో ప్రారంభమైనా 14500 వద్ద కోలుకుని కీలక మానసిక అవధి 15000 వరకు వెళ్లింది. చివరికి 14834 వద్ద వారం గరిష్ఠ స్థాయిల్లో ముగియడం పాజిటివ్‌ కన్సాలిడేషన్‌ చోటు చేసుకుంటోందనేందుకు సంకేతం. కాని 15000 వద్ద బ్రేకౌట్‌ సాధించలేకపోవడంతో తక్షణ అప్‌ట్రెండ్‌ను ధ్రువీకరించలేకపోయింది.


టెక్నికల్‌గా గత మూడు నెలలుగా సాగుతున్న సైడ్‌వైస్‌, ఆటుపోట్ల ధోరణి కొనసాగుతోంది. విదేశీ సంస్థలు, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, అమ్మకాలతో ఒక పరిధిలోనే సంచరిస్తోంది. అయితే ప్రధాన ట్రెండ్‌ మాత్రం ఎగువకే ఉంది. గత వారంలో 100 డిఎంఏ కన్నా పైన రికవరీ సాధించింది. మార్కెట్‌ ప్రధాన దిశ తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నందు వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. 

బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 15000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 15400. గత రెండు నెలల్లో ఏర్పడిన గరిష్ఠ స్థాయి ఇదే.

బేరిష్‌ స్థాయిలు: రియాక్షన్‌కు గురైనా ప్రధాన మద్దతు స్థాయిలు 14650 వద్ద కోలుకోవాలి. మరో ప్రధాన మద్దతు స్థాయి 14500.  

బ్యాంక్‌ నిఫ్టీ:గత వారంలో 1400 పాయింట్ల నష్టంతో స్వల్పకాలిక మద్దతు స్థాయి 32300 సమీపంలో బలహీనంగా క్లోజైంది. ఈ స్థాయి లో రికవరీ సాధించలేకపోతే మరింత బలహీనపడుతుంది. నిరోధ స్థాయి 32800 కన్నా పైన నిలదొక్కుకుంటే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. ప్రధాన నిరోధం 33300.

పాటర్న్‌: మార్కెట్‌ కీలక 50 డిఎంఏలో పరీక్ష ఎదుర్కొనబోతోంది. వచ్చే ఒకటి, రెండు సెషన్లలో ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. 15000 పాయింట్ల వద్ద ‘‘టాప్‌’’ ఏర్పడింది. ఈ కీలక స్థాయిని కూడా బ్రేకౌట్‌ చేస్తే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కొనసాగుతుంది. ‘‘ఏటవాలుగా దిగువకు కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ నుంచి వెలుపలికి వస్తున్నట్టు కనిపించడం సానుకూల సంకేతం.   


టైమ్‌

ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి రివర్సల్‌ ఉంది.


సోమవారం స్థాయిలు

నిరోధం : 14920, 15000 

మద్దతు : 14780, 14700


-వి. సుందర్‌ రాజా


Updated Date - 2021-04-12T06:05:29+05:30 IST