13000 వద్ద పరీక్ష -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2020-11-30T07:14:40+05:30 IST

నిఫ్టీ మానసిక అవధి 13000 వరకు వెళ్లి బలమైన రియాక్షన్‌ సాధించింది. కాని దిగువ స్థాయి ల్లో బలంగా కోలుకుని చివరికి 110 పాయింట్ల లాభంతో ముగిసింది. వీక్లీ చార్టుల ప్రకారం వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమ ముగియడం ట్రెండ్‌లో...

13000 వద్ద పరీక్ష  -టెక్‌ వ్యూ

నిఫ్టీ మానసిక అవధి 13000 వరకు వెళ్లి బలమైన రియాక్షన్‌ సాధించింది. కాని దిగువ స్థాయి ల్లో బలంగా కోలుకుని చివరికి 110 పాయింట్ల లాభంతో ముగిసింది. వీక్లీ చార్టుల ప్రకారం వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమ ముగియడం ట్రెండ్‌లో అనిశ్చితిని సూచిస్తోంది. ప్రధాన ట్రెండ్‌ పాజిటివ్‌గానే ఉన్నా గరిష్ఠ స్థాయిల్లో మరింతగా కన్సాలిడేట్‌ కావచ్చు. గత నాలుగు వారాల్లో సాధించిన రికార్డు ర్యాలీలో నిఫ్టీ 1500 పాయింట్ల వరకు లాభపడింది. ఆర్‌ఎ్‌సఐ సూచీల ప్రకారం ఓవర్‌బాట్‌ స్థితి కొనసాగుతున్నందు వల్ల గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలి.


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం గత రెండు సెషన్లలో సాధించిన గరిష్ఠ స్థాయి 13040 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 13150. ఆ పైన మాత్రమే అప్‌ట్రెండ్‌ మరింత కొనసాగుతుంది. 

బేరిష్‌ స్థాయిలు: 13000 వద్ద విఫలమైతే కన్సాలిడేషన్‌ లేదా కరెక్షన్‌ ఆస్కారం ఉన్నట్టు సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 12700. ఇదే స్వల్పకాలిక మద్దతు స్థాయి. అంతకన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 12450.

బ్యాంక్‌ నిఫ్టీ: గత నాలుగు వారాల్లో ఈ సూచి 6000 పాయింట్ల మేరకు భారీ ర్యాలీ సాధించి మానసిక అవధి 30000 వద్ద రియాక్షన్‌లో పడింది. ప్రధాన నిరోధం 29750. ఆ పైన మాత్రమే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుం ది. ప్రధాన మద్దతు స్థాయి 29350 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 28900. 

పాటర్న్‌: 13050 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. 12700 వద్ద ‘‘అడ్డం గా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి మద్దతు ఉంది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది. అయితే 50 డిఎంఏ కన్నా చాలా పైనే ఉండడం ప్రధాన ట్రెండ్‌ ఇప్పటికీ ఎగువకే ఉందనేందుకు సంకేతం. 

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి రివర్సల్‌ ఉంది.  



సోమవారం స్థాయిలు

నిరోధం : 13010, 13050 

మద్దతు : 12880, 12800


Updated Date - 2020-11-30T07:14:40+05:30 IST