ప్రధాన నిరోధం 15300 -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2021-03-08T06:48:32+05:30 IST

నిఫ్టీ 15300 వరకు వెళ్లి కరెక్షన్‌లో పడినా చివరికి 400 పాయింట్ల లాభతో వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్యన ముగిసింది. మరింత కన్సాలిడేషన్‌ అవసరమనేందుకు ఇది సంకేతం...

ప్రధాన నిరోధం 15300  -టెక్‌ వ్యూ

నిఫ్టీ 15300 వరకు వెళ్లి కరెక్షన్‌లో పడినా చివరికి 400 పాయింట్ల లాభతో వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్యన ముగిసింది. మరింత కన్సాలిడేషన్‌ అవసరమనేందుకు ఇది సంకేతం. మార్కెట్‌ గత నాలుగు వారాలుగా 15000 పాయింట్ల వద్ద సైడ్‌వేస్‌ ధోరణిలో ఉంది. తదుపరి ప్రధాన దిశ తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్‌ పరిధి 14500-15300 మధ్యన ఉంది. స్పష్టమైన ట్రెండ్‌ కోసం ఈ రెండింటిలో ఏదో ఒకటి బ్రేక్‌ చేయాలి. అలాగే కీలకమైన 20, 50 డిఎంఏల వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. 15000-15300 స్థాయిలో బలమైన నిరోధం ఉంది.

బుల్లిష్‌ స్థాయిలు : మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 15050 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం, టార్గెట్‌ 15300. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే సరికొత్త శిఖరాల దిశగా పురోగమిస్తుంది.

బేరిష్‌ స్థాయిలు : మానసిక అవధి 15000 వద్ద విఫలమైతే బలహీనత ముప్పును సూచిస్తుంది. 14900 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 14700, 14500. ఇక్కడ కన్సాలిడేట్‌ కావాలి.

బ్యాంక్‌ నిఫ్టీ : మరింత అప్‌ట్రెండ్‌ కోసం తదుపరి నిరోధం 35600 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 36000. ప్రధాన మద్దతు స్థాయి 34800 కన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌ మరింతగా కొనసాగుతుంది. 

పాటర్న్‌ : నిఫ్టీ 15300 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ బ్రేకౌట్‌ సాధించాలి. ఇదే స్థాయిలో డబుల్‌ టాప్‌ పాటర్న్‌ కూడా ఏర్పడింది. అలాగే మార్కెట్‌ ‘‘ఏటవాలుగా దిగువకు కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగువన ఉంది. బుల్లిష్‌ ట్రెండ్‌కు మరింత సమయం అవసరమనేందుకు ఇది సంకేతం. ఇదే సమయంలో 14500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా చాలా పైన ఉంది. 

టైమ్‌ : శుక్రవారం తదుపరి రివర్సల్‌ ఉంది.


సోమవారం స్థాయిలు

నిరోధం : 15050, 15130 

మద్దతు : 14980, 14900



వి. సుందర్‌ రాజా


Updated Date - 2021-03-08T06:48:32+05:30 IST