Advertisement
Advertisement
Abn logo
Advertisement

17900 దిగువన మరింత బలహీనం

టెక్‌ వ్యూ

నిఫ్టీ ర్యాలీని కొనసాగించి 18550 స్థాయిని దాటినప్పటికీ గరిష్ఠ స్థాయిల్లో బలమైన కరెక్షన్‌కు లోనయింది. చివరికి 220 పాయింట్లకు పైబడిన నష్టంతో కీలక స్థాయి 18000కు చేరువలో క్లోజైంది. అయినా తదుపరి ట్రెండ్‌ను నిర్ణయించే కీలక స్థాయి, స్వల్పకాలిక మద్దతు స్థాయి కన్నా పైనే ఉంది. 12 వారాల నిరంతర ర్యాలీలో నిఫ్టీ 3000 పాయింట్లకు పైగా లాభపడిన అనంతరం ఏర్పడిన బలమైన రియాక్షన్‌ ఇది. ఓవర్‌బాట్‌ స్థితి సద్దుబాటవుతోంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు, ప్రధాన రంగాల షేర్లు సహా అన్ని విభాగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి బలంగా ఉంది. ఈ పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌లో నిఫ్టీ.. 18000-17900 స్థాయిల్లో నిలదొక్కుకోవడం తప్పనిసరి.


బుల్లిష్‌ స్థాయిలు:

మరింత అప్‌ట్రెండ్‌ కోసం నిరోధ స్థాయి, గత శుక్రవారం ఏర్పడిన టాప్‌ 18300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 18600. ఆ పైన మాత్రమే కొత్త శిఖరాలకు నిచ్చెన వేస్తుంది.

బేరిష్‌ స్థాయిలు:

డౌన్‌ట్రెండ్‌లో పడినా భద్రత కోసం 17900 వద్ద రికవరీ సాధించి తీరాలి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతగా భావించి స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. ప్రధాన మద్దతు స్థాయిలు 17300, 17000.

బ్యాంక్‌ నిఫ్టీ:

గత వారం బలమైన ర్యాలీతో 1550 పాయింట్లకు పైగా లాభపడి కీలక స్థాయి 40,000 కన్నా పైన ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిల్లో క్లోజైంది. అప్రమత్తంగా ఉండాలి. కరెక్షన్‌లో పడినా మరింత కరెక్షన్‌ నివారించుకోవడానికి మద్దతు స్థాయి 39,900 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి.

పాటర్న్‌ :

ప్రస్తుతం ఈ సూచీ 17,900 వద్ద ‘‘ఏటవాలుగా ఎగువకు ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ సమీపంలో ఉంది. భద్రత కోసం ఇక్కడ రికవరీ తప్పనిసరి. బ్రేక్‌డౌన్‌లో పడి ఇదే స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే అప్రమత్తత సూచిస్తుంది. మార్కెట్‌ ఇప్పటికీ ఓవర్‌బాట్‌ స్థితిలో ఉంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధ, శుక్ర వారాల్లో రివర్సల్స్‌ ఉన్నాయి.

సోమవారం స్థాయిలు

నిరోధం: 18210, 18300

మద్దతు : 18040, 17960

www.sundartrends.in

Advertisement
Advertisement