ముగింపు అనిశ్చితం -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2021-05-17T06:42:21+05:30 IST

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ధోరణిలోనే ప్రారంభమై మానసిక అవధి 15000 వరకు వెళ్లినా నిలదొక్కుకోలేక చివరికి వారంలో 150 పాయింట్ల నష్టంతో క్లోజయింది. వీక్లీ చార్టుల్లో వారం కనిష్ఠ స్థాయిలకు చేరువలో క్లోజ్‌ కావడం అమ్మకాల...

ముగింపు అనిశ్చితం -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ధోరణిలోనే ప్రారంభమై మానసిక అవధి 15000 వరకు వెళ్లినా నిలదొక్కుకోలేక చివరికి వారంలో 150 పాయింట్ల నష్టంతో క్లోజయింది. వీక్లీ చార్టుల్లో వారం కనిష్ఠ స్థాయిలకు చేరువలో క్లోజ్‌ కావడం అమ్మకాల ఒత్తిడికి సంకేతం. గత నాలుగు నెలలుగా మార్కెట్‌ సైడ్‌వేస్‌, ఆటుపోట్ల ధోరణిలో 15000-14000 మధ్యన ట్రేడవుతోంది. గత నాలుగు నెలల కాలంలో 15000 వద్ద నాలుగు టాప్‌లు, 14300 వద్ద నాలుగు బాటమ్‌లు ఏర్పడ్డాయి. దీనికి తోడు గత వారం అనిశ్చిత ధోరణిలో ముగిసింది. అయితే మార్కెట్‌ ఇప్పటికీ టెక్నికల్‌గా అప్‌ట్రెండ్‌లోనే ఉంది. అమెరికన్‌ స్టాక్‌మార్కెట్లో సానుకూల ధోరణి వల్ల ఇప్పుడు స్వల్ప అప్‌ట్రెండ్‌లో ప్రవేశించే ఆస్కారం ఉంది. కీలక నిరోధ స్థాయిల్లో మార్కెట్‌ మరోసారి పరీక్ష ఎదుర్కొనవచ్చు. అప్‌ట్రెండ్‌ను ధ్రువీకరించాలంటే బలమైన బ్రేకౌట్‌ సాధించడం తప్పనిసరి. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 14850 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 15050. ఆ పైన మాత్రమే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఆస్కారం ఉంటుంది.

బేరిష్‌ స్థాయిలు: ప్రధాన మద్దతు స్థాయి 14600 వద్ద విఫలమైతే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 14400. మరింత కరెక్షన్‌లో పడితే మానసిక అవధి 14000. 

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం మైనర్‌ అప్‌ట్రెండ్‌ అనంతరం 735 పాయింట్ల నష్టంతో కనిష్ఠ స్థాయిల్లో క్లోజయింది. ఇది బలహీనత సంకేతం. ప్రస్తుతం స్వల్పకాలిక మద్దతు స్థాయి 32000 వద్ద ఉంది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌గా భావించి బై పొజిషన్లు హోల్డ్‌ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

పాటర్న్‌: మార్కెట్‌ ప్రస్తుతం 100 డిఎంఏ వద్ద ఉంది. అప్‌ట్రెండ్‌ కోసం రాబోయే కొద్ది రోజుల్లో దీని కన్నా పైన నిలదొక్కుకోవాలి. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం 15050 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’‘ వద్ద బ్రేకౌట్‌ తప్పనిసరి. అదే సమయంలో ‘‘సపోర్ట్‌ లైన్‌’’ కన్నా చాలా పైన ఉండడం ప్రధాన ట్రెండ్‌ ఎగువకే ఉందనేందుకు సంకేతం.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉంది. వీక్లీ చార్టుల ప్రకారం సైతం ఈ వారంలో స్వల్పకాలిక రివర్సల్‌ ఉంది. అప్రమత్తంగా ఉండాలి. 



సోమవారం స్థాయిలు

నిరోధం : 14960, 15010 

మద్దతు : 14750, 14680


Updated Date - 2021-05-17T06:42:21+05:30 IST