ప్రధాన నిరోధం 16000 -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2021-06-14T06:42:42+05:30 IST

నిఫ్టీ గత వారం 15800 వరకు వెళ్లి రియాక్షన్‌కు గురైనా రికవరీ సాధించి తిరిగి ఆ స్థాయి వరకు వెళ్లింది. గతవారంలో ఈ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అయినా 15800 కన్నా పైన నిలకడగా ముగిసింది...

ప్రధాన నిరోధం 16000 -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం 15800 వరకు వెళ్లి రియాక్షన్‌కు గురైనా రికవరీ సాధించి తిరిగి ఆ స్థాయి వరకు వెళ్లింది. గతవారంలో ఈ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అయినా 15800 కన్నా పైన నిలకడగా ముగిసింది. వీక్లీ చార్టు ల్లో కూడా 130 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయిలో క్లోజయింది. 15000 పాయింట్ల నుంచి నిఫ్టీ నిలకడగా ర్యాలీ సాధిస్తూ వచ్చింది. ఈ కారణంగా కన్సాలిడేషన్‌ లేదా ఆరోగ్యవంతమైన కరెక్షన్‌ రావలసి ఉంది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్‌ ఎగువకే ఉన్నప్పటికీ జీవిత కాల గరిష్ఠ స్థాయిల్లో ఉంది. 15500 వద్ద బ్రేకౌట్‌ సాధించినందు వల్ల పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌ కూడా రావలసి ఉంది. ఆర్‌ఎ్‌సఐ సూచీలు సైతం 70 శాతాన్ని దాటడం మార్కెట్‌ ఓవర్‌బాట్‌ స్థితిలో ప్రవేశిస్తున్నదనేందుకు సంకే తం. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు సరికొత్త గరిష్ఠ స్థాయిలకు దూసుకుపోతున్న ఈ సమయంలో అప్రమత్తం పాటించడం అవశ్యం. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం 15800 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరో ధం, టార్గెట్‌ 15920. ఆ పైన మాత్రమే సరికొత్త గరిష్ఠ స్థాయిల్లోకి దూసుకుపోగలుగుతుంది. ఆ పైన నిరోధ స్థాయి 16000-16050. 

బేరిష్‌ స్థాయిలు : 15800 వద్ద విఫలమైతే బలహీనత సంకేతం ఇస్తుంది. భద్రత కోసం ఇక్కడ రికవరీ తప్పనిసరి. దిగువన మద్దతు స్థాయి 15600 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది. స్వల్పకాలిక టార్గెట్‌ 15450.

పాటర్న్‌: 16000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధం ఏర్పడింది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. 15800 వద్ద ‘‘డబుల్‌ టాప్‌’’ పాటర్న్‌ ఏర్పడింది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం దీన్ని బ్రేక్‌ చేయాలి. 15450 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద ప్రధాన మద్దతు ఉంది. అయితే ఇది కొంత దూరంలో ఉంది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు.

టైమ్‌: ఈ సూచి ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉంది. 



సోమవారం 

స్థాయిలు


నిరోధం : 15840, 15920 

మద్దతు : 15680, 15600


Updated Date - 2021-06-14T06:42:42+05:30 IST