ప్రధాన నిరోధం 11350 -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2020-08-10T06:04:49+05:30 IST

నిఫ్టీ గత వారం బలమైన కరెక్షన్‌లో ప్రారంభమైనా కీలక స్థాయి 11000 వద్ద బలమైఔన రికవరీ సాధించి తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుని అప్‌ట్రెండ్‌ సురక్షితంగా నిలబెట్టుకుంది...

ప్రధాన నిరోధం 11350  -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం బలమైన కరెక్షన్‌లో ప్రారంభమైనా కీలక స్థాయి 11000 వద్ద బలమైఔన రికవరీ సాధించి తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుని అప్‌ట్రెండ్‌ సురక్షితంగా నిలబెట్టుకుంది. చివరికి 141 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయిలో 11200 కన్నా పైన క్లోజయింది. 10, 20 డిఎంఏల కన్నా కూడా చాలా పైన ఉంది. ఇప్పుడు మరోసారి గతంలో సాధించిన టాప్‌ వద్ద పరీక్ష ఎదుర్కొనబోతోంది. రెండు వారాల కరెక్షన్‌ అనంతరం చివరికి వీక్లీ చార్టుల్లో నిలకడగా క్లోజ్‌ కావడం సానుకూల సంకేతం. స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితిని కూడా సద్దుబాటు చేసుకున్నప్పటికీ గరిష్ఠ స్థాయిలకు చేరువలో ఉంది. గత నాలుగు నెలల్లో నిరంతర అప్‌ట్రెండ్‌లో ట్రేడవుతూ 3000 పాయింట్ల మేరకు లాభపడింది. 


బుల్లిష్‌ స్థాయిలు: ప్రధాన నిరోధ స్థాయిలు 11260, 11310. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయిల కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 11350. ఇక్కడ కూడా నిలదొక్కుకుంటే తదుపరి టార్గెట్‌ 11600. 

బేరిష్‌ స్థాయిలు: మైనర్‌ మద్దతు స్థాయి 11100 కన్నా దిగజారితే మైనర్‌ బలహీనతలో పడుతుంది. కీలక మద్దతు స్థాయి 10950. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనతగా భావించవచ్చు. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

బ్యాంక్‌ నిఫ్టీ: గత కొద్ది వారాల్లో సైడ్‌వే్‌సలో ఉన్న ఈ సూచి గత వారం 114 పాయింట్ల మైనర్‌ రికవరీ సాధించింది. ఇంకా 20 డిఎంఏ కన్నా దిగువనే ఉంది. ప్రధాన మద్దతు స్థాయి 22000. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. 

పాటర్న్‌: మరింత అప్‌ట్రెండ్‌ కోసం 11350 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ను బ్రేక్‌ చేయాలి. 10950 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి మద్దతు ఉంది. ఇది చాలా దూరంగానే ఉంది. 

టైమ్‌: ఈ సూచీ ప్రకారం వచ్చే మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉంది. 



భారతి ఎయిర్‌టెల్‌ (రూ.560) కొనుగోలు స్థాయిలకు చేరువలో..

రూ.560 ఎగువన కొనుగోలు మొదటి నిరోధం రూ.585 రెండో నిరోధం రూ.605

రూ.545 దిగువన డౌన్‌ట్రెండ్‌ మొదటి మద్దతు రూ.525 రెండో మద్దతు రూ.500



సోమవారం స్థాయిలు

నిరోధం : 11260, 11310  

మద్దతు : 11160, 11100

Updated Date - 2020-08-10T06:04:49+05:30 IST