మళ్లీ కుదేలైన భారత స్టాక్ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-03-30T23:03:24+05:30 IST

గత నాలుగు సెషన్లలో లాభాల బాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ కుదేలయ్యాయి...

మళ్లీ కుదేలైన భారత స్టాక్ మార్కెట్లు

ముంబై: గత నాలుగు సెషన్లలో లాభాల బాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ కుదేలయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్స్, ఆటో, మెటల్స్, రియాల్టీ స్టాకులు సహా అన్ని సూచీలు నేలచూపులు చూడడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 29 వేల మార్కు దిగువకు పడిపోయింది. నిఫ్టీ సైతం అదే బాటలో పయనించి 8300 కంటే దిగువకు పడిపోయింది.  ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటుండడంతో.. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,375.27 పాయింట్ల (4.61 శాతం) నష్టంతో 28,440.32 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 379.15 పాయింట్ల (4.38 శాతం) నష్టపోయి 8,281.10 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 

Updated Date - 2020-03-30T23:03:24+05:30 IST