కీలక స్థాయి 16000 -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2021-07-26T07:28:44+05:30 IST

నిఫ్టీ గత వారంలో బలమైన కరెక్షన్‌లో ప్రారంభమైనా తదుపరి చివరి రెండు సెషన్లలో బలమైన బౌన్స్‌బ్యాక్‌ సాధించి తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది...

కీలక స్థాయి 16000  -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారంలో బలమైన కరెక్షన్‌లో ప్రారంభమైనా తదుపరి చివరి రెండు సెషన్లలో బలమైన బౌన్స్‌బ్యాక్‌ సాధించి తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది. టెక్నికల్‌గా మార్కెట్‌ ఎగుడుదిగుడులుగా సైడ్‌వేస్‌ ధోరణి కొనసాగించి చివరికి వారం గరిష్ఠ స్థాయిల్లో క్లోజ్‌ కావడం పాజిటివ్‌ సంకేతం. మార్కెట్‌ కదలికలు 15500-16000 పాయింట్ల పరిమిత పరిధిలోనే కదలాడుతోంది. నాలుగు వారాల నుంచి కీలక స్థాయి 16000 దాటాలని ఎన్నో విఫలయత్నాలు చేస్తోంది. తాజా ర్యాలీలో ప్రవేశించాలంటే ఇక్కడ బ్రేకౌట్‌ సాధించి తీరాలి. అమెరికన్‌ మార్కెట్లలో రికవరీ ప్రభావం వల్ల టెక్నికల్‌గా అప్రమత్త పాజిటివ్‌ ట్రెండ్‌కు ఆస్కారం ఉంది. 16000 కీలక మధ్యకాలిక, స్వల్పకాలిక స్థాయి కావడం వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. 


బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధం 15940 కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. ప్రధాన నిరోధం 16000. ఆ పైన మాత్రమే తాజా ర్యాలీకి ఆస్కారం ఉంది. ఆ పైన మానసిక అవధులు 16300, 16550.


బేరిష్‌ స్థాయిలు: రియాక్షన్‌లో పడినా భద్రత కోసం ప్రధాన మద్దతు స్థాయి 15700 కన్నా పైన నిలదొక్కుకోవాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత తప్పదు. ప్రధాన మద్దతు స్థాయి 15450. జూన్‌ 15న ఏర్పడిన కీలక బాటమ్‌ ఇదే.


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారంలో 700 పాయింట్ల నష్టంతో వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమన అనిశ్చితంగా ముగిసింది. ప్రధాన మద్దతు స్థాయి కన్నా పైనే ముగియడం ట్రెండ్‌లో నిలకడను సూచిస్తోంది. 36000 వద్ద బలమైన నిరోధం ఎదుర్కొంటోంది. ఇక్కడ బ్రేకౌట్‌ సాధించినప్పుడే ర్యాలీ మరింతగా కొనసాగుతుంది. 


పాటర్న్‌: గత వారం మార్కెట్‌ 50 డిఎంఏ కన్నా పైన ముగిసింది. ఇది సానుకూల సంకేతం. 16000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద బ్రేకౌట్‌ సాధించినప్పుడే మరింత ర్యాలీకి ఆస్కారం ఉంది. అయితే 15450 వద్ద ఏర్పడిన ‘‘ప్రధాన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా చాలా పైన ఉండడం తక్షణ ప్రమాదం లేదనేందుకు సంకేతం.  

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉంది. 




టెక్‌ బెట్స్‌

జిందాల్‌ స్టీల్‌ : కొద్ది వారాల నుంచి ఈ షేరు రూ.700 వద్ద కన్సాలిడేషన్‌ అవుతూ వస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.717 వద్ద క్లోజైంది. ఈ షేరు స్వల్పంగా పడినప్పుడు కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అప్‌ట్రెండ్‌లో సాగితే తదుపరి నిరోధ స్థాయిలు రూ.750, రూ.780. ఒకవేళ రూ.690 దిగువకు చేరితే దాన్ని స్టాప్‌లా్‌సగా పరిగణించి వెలుపలికి రావటం మంచిది.

టాటా కన్స్యూమర్‌ : ఈ షేరు రూ.750 స్థాయిల వద్ద కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. గత వారం రూ.775 వద్ద పటిష్ఠంగా క్లోజైంది. స్వల్పంగా పడినప్పుడు ఈ షేరును కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించచ్చు. తదుపరి రూ.800, రూ.840 స్థాయిలు నిరోధ స్థాయిలుగా ఉంటా యి. ఒకవేళ  రూ.750 దిగువకు పడిపోతే దాన్ని స్టాప్‌లాస్‌గా పెట్టుకుని ఎగ్జిట్‌ కావచ్చు. 


సోమవారం స్థాయిలు

నిరోధం : 15940, 16000

మద్దతు : 15780, 15700


-వి. సుందర్‌ రాజా

Updated Date - 2021-07-26T07:28:44+05:30 IST