ప్రధాన మద్దతు స్థాయి 11000

ABN , First Publish Date - 2020-08-03T07:58:11+05:30 IST

నిఫ్టీ గత వారంలో 11260 స్థాయిని దాటినా పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌లో పడి 121 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయిలో ముగిసింది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్‌ ఎగువకే ఉన్నప్పటికీ స్వల్పకాలిక మద్దతు స్థాయి

ప్రధాన మద్దతు స్థాయి 11000

నిఫ్టీ గత వారంలో 11260 స్థాయిని దాటినా పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌లో పడి 121 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయిలో ముగిసింది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్‌ ఎగువకే ఉన్నప్పటికీ స్వల్పకాలిక మద్దతు స్థాయి 11000 వద్ద పరీక్ష ఎదుర్కొనబోతోంది. వీక్లీ చార్టుల్లో దిగువకు రివర్సల్‌ బార్‌ ఏర్పడింది. రానున్న కొద్ది రోజుల్లో సైడ్‌వేస్‌, కన్సాలిడేషన్‌ ట్రెండ్‌లో ట్రేడ్‌ కావచ్చు. మార్కెట్‌ ఇప్పటికీ 20, 50 డిఎంఏల కన్నా పైనే ఉంది. నాలుగు నెలలుగా నిరంతర అప్‌ట్రెండ్‌లో ఉంటూ గత ఏడు వారాల్లో 3000 పాయింట్లకు పైగా లాభపడి ప్రధాన బ్రేకౌట్‌ ఏర్పడినందు వల్ల కన్సాలిడేషన్‌ లేదా కరెక్షన్‌ కూడా సహజంగానే రావలసి ఉంది. ఓవర్‌బాట్‌ స్థితి ఏర్పడినందు వల్ల స్వల్పకాలికల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. స్టాక్‌ ఆధారిత కదలికలే అధికంగా ఉండవచ్చు.


బుల్లిష్‌ స్థాయిలు: స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం 11000 వద్ద తప్పనిసరిగా పునరుజ్జీవం సాధించి బలంగా క్లోజ్‌ కావాలి. ప్రధాన నిరోధం 11200. ఆ పైన టార్గెట్లు 11350, 11500.


బేరిష్‌ స్థాయిలు: 11000 వద్ద విఫలమైతే స్వల్పకాలిక కరెక్షన్‌లో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 10750, 10500. 

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచి 1000 పాయింట్ల నష్టంతో 22000 కన్నా దిగువన క్లోజయింది. వీక్లీ చార్టుల్లో దిగువకు రివర్సల్‌ బార్‌ ఏర్పడడం, నెలవారీ చార్టుల్లో కూడా బలహీనం కావడం వల్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రధాన మద్దతు స్థాయి 21000. ప్రధాన నిరోధం 22000. అంతకన్నా పైన స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఏర్పడుతుంది.


పాటర్న్‌: 11000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌ ఏర్పడవచ్చు. 11200 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌ 11000 వద్ద ‘‘ఏటవాలుగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద ఉండడం అప్రమత్త సంకేతం.


టైమ్‌: ఈ సూచీ ప్రకారం తదుపరి రివర్సల్‌ సోమవారం ఉంది.


గోద్రెజ్‌ కన్స్యూమర్‌ (రూ.695) కొనుగోలు స్థాయిలకు చేరువలో..

రూ.690 ఎగువన కొనుగోలు మొదటి నిరోధం రూ.725 రెండో నిరోధం రూ.755

రూ.675 దిగువన డౌన్‌ట్రెండ్‌ మొదటి మద్దతు రూ.650 రెండో మద్దతు రూ.625


సోమవారం స్థాయిలు

నిరోధం : 11140, 11200  

మద్దతు : 11000, 10960

www.sundartrends.in

Updated Date - 2020-08-03T07:58:11+05:30 IST