నిరోధ స్థాయిలు 9750, 10000 -టెక్ వ్యూ

ABN , First Publish Date - 2020-06-01T06:10:31+05:30 IST

నిఫ్టీ గత వారం ప్రారంభంలోనే పటిష్ఠమైన రికవరీ సాధించి చివరకు వారాంతంలో 550 పాయింట్ల లాభంతో గరిష్ఠ స్థాయిలో క్లోజైంది. మంత్లీ చార్టుల ప్రకా రం మే నెలలో బలమైన అప్‌సైడ్‌ రివర్సల్‌ కనబరిచి చివరకు నెల గరిష్ఠ స్థాయిలో ముగియటమే...

నిరోధ స్థాయిలు 9750, 10000 -టెక్ వ్యూ

నిఫ్టీ గత వారం ప్రారంభంలోనే పటిష్ఠమైన రికవరీ సాధించి చివరకు వారాంతంలో 550 పాయింట్ల లాభంతో గరిష్ఠ స్థాయిలో క్లోజైంది. మంత్లీ చార్టుల ప్రకా రం మే నెలలో బలమైన అప్‌సైడ్‌ రివర్సల్‌ కనబరిచి చివరకు నెల గరిష్ఠ స్థాయిలో ముగియటమే కాకుండా సానుకూల ట్రెండ్‌యువొోను సూచించింది. టెక్నికల్‌గా మార్కెట్‌ స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ఉంది. ప్రస్తుతం స్వల్పకాలిక నిరోధ స్థాయిలైన 10000కు చేరువలో ఉంది. ఇక్కడ గట్టి పరీక్షను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. నిఫ్టీ గతవారం 25, 50 డిఎంఏలను అధిగమించింది. 100 డిఎంఏ వద్ద ప్రధాన నిరోధాన్ని ఎదుర్కోనుంది. టెక్నికల్‌గా మార్కెట్‌కు 9750, 10000 తదుపరి ప్రధాన నిరోధ స్థాయిలుగా ఉండనున్నాయి. స్వల్పకాలిక దిశను తీసుకునే ముందు ఈ స్థాయిల వద్ద కన్సాలిడేషన్‌ లేదా రియాక్షన్‌కు అవకాశాలున్నాయి. 


బుల్లిష్‌ స్థాయిలు: అప్‌ట్రెండ్‌ను కనబరిస్తే 9600 ఎగువన నిరోధ స్థాయిలు ఉంటాయి. ఆ పైన నిలదొక్కుకుంటే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధం 9750.  

బేరిష్‌ స్థాయిలు: నిరోధ స్థాయిలైన 9600 వద్ద నిలదొక్కుకోలేకపోతే బలహీనతను సూచిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 9300. ఈ స్థాయిల వద్ద  నిలదొక్కుకోకపోతే స్వల్పకాలిక కరెక్షన్‌ను సూచిస్తుంది. 

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీకి ప్రధాన నిరోధం 19500. అప్‌ట్రెండ్‌ కోసం అంతకన్నా పైన నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధం 20200

పాటర్న్‌: 10000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధాన్ని ఎదుర్కోనుంది. ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. అలాగే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ‘‘ఏటవాలుగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ నుంచి బయటకు రావాలి. ‘‘అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా ఎగువన ఉండటంతో సత్వర డౌన్‌ట్రెండ్‌కు అవకాశాలు లేవు. 

టైమ్‌: ఈ సూచీ ప్రకారం వచ్చే మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉంది.



సన్‌ ఫార్మా (రూ.471) కొనుగోలు స్థాయిలకు చేరువలో..

రూ.470 ఎగువన అప్‌ట్రెండ్‌ మొదటి నిరోధం రూ.500  రెండో నిరోధం రూ.530

రూ.455 దిగువన డౌన్‌ట్రెండ్‌ మొదటి మద్దతు రూ.430 రెండో మద్దతు రూ.400


సోమవారం స్థాయిలు

నిరోధం : 9650, 9710  

మద్దతు : 9560, 9500

www.sundartrends.in

Updated Date - 2020-06-01T06:10:31+05:30 IST