భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-08-14T22:00:55+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి..

భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 433 పాయింట్లు నష్టపోగా... నిఫ్టీ సైతం కీలకమైన 11,200 మార్కునకు దిగువన నమోదైంది. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 433.15 పాయింట్లు (1.13 శాతం) నష్టపోయి 37877.34 వద్ద స్థిరపడగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 122.10 పాయింట్లు (1.08 శాతం) క్షీణించి 11178.40 వద్ది క్లోజ్ అయ్యింది. ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు తదితర షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు జెఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, సిప్లా, ఎన్‌టీపీసీ తదితర షేర్లు ముందంజలో ఉన్నాయి. మెటల్, ఫార్మా తప్ప మొత్తం అన్ని రంగాల సూచీలు ఇవాళ నేలచూపులు చూశాయి. 

Updated Date - 2020-08-14T22:00:55+05:30 IST