Abn logo
Dec 5 2020 @ 21:06PM

ట్రంప్ దేశద్రోహి.. వైట్‌హౌస్‌ను వీడిన వెంటనే జైల్లో పెట్టాలి: ట్రంప్ మేనకోడలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన మేనకోడలు మేరీ ట్రంప్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కిమినల్ అని, ఆయన దేశద్రోహి అంటూ సంచలన విమర్శలు సంధించారు. అంతేకాకుండా ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడిన వెంటనే జైలుకు వెళ్లేందుకు అర్హుడని ఆమె అన్నారు. సైకాలజిస్ట్, రచయితగా ఉన్న మేరీ ట్రంప్ గతంలోనూ ట్రంప్‌పై అనేక ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేరీ ట్రంప్ ప్రస్తుతం ‘ద రెకనింగ్’ అనే పుస్తకాన్ని రచిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ ఆర్థిక, మానసిక ప్రభావాల గురించి ఆమె తన పుస్తకంలో ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా ట్రంప్ కరోనాను ఎదుర్కొన్న తీరు గురించి ఆమె పుస్తకంలో రాయనున్నారు. కరోనా మహమ్మారిని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోలేదని మేరీ ట్రంప్ ఆరోపించారు. కాగా.. ట్రంప్‌తో పాటు తన కుటుంబంలోని ఇతర సభ్యులు కుటుంబ వ్యాపారాల నుంచి తనను దూరంగా పెట్టి మోసం చేశారంటూ సెప్టెంబర్ నెలలో మేరీ ట్రంప్ కోర్టుకెక్కారు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement