Abn logo
Sep 25 2021 @ 00:23AM

నిధులు మళ్లించేందుకే బ్రాహ్మణ కార్పొరేషన్‌ విలీనం

మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

మార్టూరు, సెప్టెంబరు 24 : నిధులు మళ్లించేందుకే దేవదా య శాఖ పరిఽఽధి నుంచి బ్రాహ్మణ  కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖ పరిఽఽధిలోకి తీసు కువెళుతున్నారని టీడీపీ నాయకులు, రాష్ట్ర బ్రాహ్మణ ఫ్రంట్‌ పర్చూరు నియోజకవర్గ నాయకులు విమర్శించారు. శుక్రవారం మండలంలోని ఇసుక దర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ నుంచి నిధులు మళ్లిం చేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులపై దాడులు పెరిగాయని బ్రాహ్మణ ఫ్రంట్‌ నాయకులు నార్నెపాటి శరత్‌ విమర్శించారు. తక్షణమే 103 జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు కామేపల్లి హరి బాబు, శివరాత్రి శ్రీను, తాటి నాగేశ్వరరావు, మానం సాయి బాబు, అడుసుమల్లి శ్రీనివా సరావు తదితరులు పాల్గొన్నారు.