Sep 24 2021 @ 12:20PM

మీడియా ఒత్తిడి వల్లే... పెళ్లి పెటాకులైందట!

నికోల్ కిడ్‌మ్యాన్, టామ్ క్రూజ్ జంట 90వ దశకపు హాలీవుడ్ మీడియాకి హాట్ ఫేవరెట్స్. 1990లో విడుదలైన ‘డేస్ ఆఫ్ థండర్’ మూవీ సెట్స్‌పైన వారు మొదటి సారి కలిశారు. అయితే, వెంటనే ప్రేమలో పడిపోయిన గ్లామరస్ కపుల్ ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నారు. పదేళ్లకు పైగా కాపురం చేశారు. కానీ, ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్న సెలబ్రిటీ కపుల్ 2001లో విడిపోయారు కూడా!


టామ్ క్రూజ్‌తో విడాకుల తరువాత ఆ విషయంపై పెద్దగా చర్చించని నికోల్ ఇన్నాళ్లకు ఓ ఇంటర్వ్యూలో అసలు కారణం చెప్పింది. అప్పట్లో తాను చాలా యంగ్ అంది. అంతే కాదు, ఆమె తన మీద మీడియా పెట్టిన ఫోకస్ వల్ల కూడా ఒత్తిడికిలోనైందట. మీడియా అతి వల్ల తన కెరీర్ మరుగున పడి పెళ్లి, వ్యక్తిగత జీవితం మాత్రమే హైలైట్ అయ్యాయంటోంది. చివరకు, పదేళ్ల సహజీవనం తరువాత టామ్ నుంచీ డైవోర్స్ తీసుకోక తప్పలేదట!


తమ విడాకులకి మీడియా కారణమని నికోల్ కిడ్‌మ్యాన్ అనటం కాస్త ఆశ్చర్యం కలిగించేదే. కానీ, 90లలో ఆమె లవ్ అండ్ మ్యారేజ్ అంశాలు అంతలా సంచలనం అయ్యాయి. అందుకే, రెండోసారి సింగర్ కెయిత్ అర్బన్‌ను పెళ్లాడిన ఆమె ఎంతో జాగ్రత్త పడింది. మీడియా అల్లరి లేకుండా కేర్‌పుల్‌గా ముందుకు సాగింది. ఇఫ్పుడు 54 ఏళ్ల నికోల్‌కి రెండో భర్త ద్వారా ఇద్దరు పిల్లలు... 

Otherwoodsమరిన్ని...