యూఎస్‌ ఓపెన్‌కు కిర్గియోస్‌ నో

ABN , First Publish Date - 2020-08-03T09:03:46+05:30 IST

ఆస్ట్రేలియా టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు నిక్‌ కిర్గియోస్‌ ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఆడడం లేదు. కరోనా మహమ్మారి...

యూఎస్‌ ఓపెన్‌కు కిర్గియోస్‌ నో

సిడ్నీ: ఆస్ట్రేలియా టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు నిక్‌ కిర్గియోస్‌ ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఆడడం లేదు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు నిక్‌ ఆదివారం ప్రకటించాడు. సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ అయిన యూఎస్‌ ఓపెన్‌ను వచ్చేనెల 31 నుంచి సెప్టెంబరు 13 వరకు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆరోగ్యం, భద్రత కారణాల రీత్యా ఈవెంట్‌కు రావడం లేదని నిక్‌ తెలిపాడు. ఇదే కారణాలతో ఆసీ్‌సకే చెందిన మహిళల ప్రపంచ నెంబర్‌వన్‌ ఆష్లే బార్టీ కూడా యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకొంది.

Updated Date - 2020-08-03T09:03:46+05:30 IST