NIA అదుపులో Dawood Ibrahim సన్నిహితుడు.. ముంబైలో..

ABN , First Publish Date - 2022-05-10T01:34:51+05:30 IST

ముంబై : అండర్‌వరల్డ్ డాన్ Dawood Ibrahimకు అత్యంత సన్నిహిత సహాయకుడైన గుడ్డు పథాన్‌ను కస్టడీలోకి తీసుకున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ప్రకటించింది.

NIA అదుపులో Dawood Ibrahim సన్నిహితుడు.. ముంబైలో..

ముంబై : అండర్‌వరల్డ్ డాన్ Dawood Ibrahimకు అత్యంత సన్నిహిత సహాయకుడైన గుడ్డు పథాన్‌ను కస్టడీలోకి తీసుకున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ప్రకటించింది. ముంబైలో నివాసముంటున్న దావూద్ ఇబ్రహిం సహాయకుల నివాసాల్లో ఎన్‌ఐఏ సోమవారం విస్తృత సోదాలు నిర్వహించింది. 20కిపైగా ప్రాంతాల్లో శోధనలు జరిగాయి. వేర్వేరు ప్రాంతాలకు చెందిన మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌ఐఏ వివరించింది. ఇంటరాగేషన్ జరుపుతున్నట్టు తెలిపింది. కాగా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని వివరించింది.


కాగా సోమవారం ఉదయమే సోదాల్లో భాగంగా.. గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్‌కు సన్నిహితుడైన సలీం ఖురేషీ అలియాస్ సలీం ఫ్రూట్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. అంతేకాకుండా ముంబైలోని హజీ అలీ దర్గాకు చెందిన ఒక ట్రస్టీని కూడా అరెస్ట్ చేసింది. ముంబైతోపాటు పుణెలోని 20 చోట్ల సోమవారం దర్యాప్తు జరిపామని, అనంతరం వీరిని అరెస్ట్ చేశామని వెల్లడించింది. కాగా ఛోటా షకీల్ మరదలి భర్తే సలీం ఖురేషీ. దక్షిణ ముంబైలోని అతడి నివాసం భెండీ బజార్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌ఐఏ వివరించింది.

Read more