ఉగ్రవాద కుట్ర కోణం: ఎన్ఐఏ దాడులు, ఎల్ఈఎం ఉగ్రవాది అరెస్టు

ABN , First Publish Date - 2021-08-01T01:40:32+05:30 IST

ఉగ్రవాద కుట్రలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లో..

ఉగ్రవాద కుట్ర కోణం: ఎన్ఐఏ దాడులు, ఎల్ఈఎం ఉగ్రవాది అరెస్టు

శ్రీనగర్: ఉగ్రవాద కుట్రలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లో 'లష్కరే ముస్తఫా' (ఎల్ఈఎం) ఉగ్రవాద సంస్థ 'ఉగ్ర కుట్ర'లకు సంబంధించి శనివారంనాడు విస్తృత దాడులు జరిపింది. షోపియాన్, అనంతనాగ్, జమ్మూ జిల్లాల్లోని  9 ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించింది. ఎల్ఈఎం ఉగ్రవాది ఇర్ఫాన్ అహ్మద్ డర్‌‌ను  అరెస్టు చేసింది. అతని నుంచి మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు, మెమరీ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఉగ్రవాద ప్రేరేపిత సాహిత్యం తదితరాలను స్వాధీనం చేసుకుంది. పలు ఉగ్రవాద కార్యకలాపాలు, కుట్రల్లో డర్ కీలక నిందితుడని ప్రాథమిక విచారలో తేలినట్టు ఆ వర్గాలు తెలిపాయి. తదుపరి దర్యాప్తు సాగిస్తున్నట్టు ఎన్ఐఏ తెలిపింది.

Updated Date - 2021-08-01T01:40:32+05:30 IST