Abn logo
Nov 25 2021 @ 16:33PM

ఏపీ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణలోని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఒత్తిడి కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక కోరుతూ తెలుగు రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులిచ్చింది. అయితే ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. 6 వారాల్లో సమాధానమివ్వాలని ఏపీకి మరోసారి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులిచ్చింది. నివేదిక ఇవ్వకపోతే చట్టబద్ధంగా తీసుకునే చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించింది.