ఎన్‌హెచ్‌ఎంకు 1015 కోట్ల బడ్జెట్‌

ABN , First Publish Date - 2020-12-03T09:12:27+05:30 IST

ఆంధప్రదేశ్‌ జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం)కు ఈ ఏడాది వచ్చిన రూ.1015.52 కోట్లను కేంద్ర ప్రభుత్వ అనుమతుల మేరకు వినియోగించామని

ఎన్‌హెచ్‌ఎంకు 1015 కోట్ల బడ్జెట్‌

ఆరోగ్యశాఖ కమిషనర్‌ భాస్కర్‌ వెల్లడి

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన


అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆంధప్రదేశ్‌ జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం)కు ఈ ఏడాది వచ్చిన రూ.1015.52 కోట్లను కేంద్ర ప్రభుత్వ అనుమతుల మేరకు వినియోగించామని ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. ‘రూ.600 కోట్లు మళ్లీంపు’ శీర్షిక న బుధవారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. కొవిడ్‌ నివారణ చర్యలకు మొత్తం రూ.1153.45 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.320.13 కోట్లు ఎన్‌హెచ్‌ఎం, రూ.326.66కోట్లు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, రూ.18.23కోట్లు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి విడుదలయ్యాయన్నారు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తనవాటాగా 488.44కోట్లు విడుదల చేసిందన్నారు. ఇందులో ఇప్పటివరకూ రూ.905 కోట్లు ఖర్చయిందన్నారు. మంగళవారం నాటికి ఒక్క రూపాయి కూడా బిల్లులు పెండింగ్‌లో లేవన్నారు.

Updated Date - 2020-12-03T09:12:27+05:30 IST