ఎన్జీటీ ప్రత్యేక బృందం పర్యటన

ABN , First Publish Date - 2021-09-17T04:38:39+05:30 IST

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎ న్జీటీ) ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల బృందం గురువారం మహబూబ్‌నగర్‌ జి ల్లాలోని భూత్పూర్‌, జడ్చర్ల, నవాబ్‌పేట మండలాల్లో పర్యటించింది.

ఎన్జీటీ ప్రత్యేక బృందం పర్యటన
కర్వెన రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న ఎన్జీటీ ప్రత్యేక అధికారుల బృందం

- కర్వెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్ల మ్యాప్‌ల పరిశీలన 

- నవాబ్‌పేట, జడ్చర్ల మండలాల్లో చెరువుల నుంచి ఒండ్రు మట్టి తరలింపుపై ఆరా

- పథకం గురించి అధికారులకు వివరించిన కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు 

- నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు వెల్లడి


భూత్పూర్‌/జడ్చర్ల/నవాబ్‌పేట, సెప్టెంబరు 16 : జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎ న్జీటీ) ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల బృందం గురువారం మహబూబ్‌నగర్‌ జి ల్లాలోని భూత్పూర్‌, జడ్చర్ల, నవాబ్‌పేట మండలాల్లో పర్యటించింది. ఈ సందర్భం గా బృందం సభ్యులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్‌ఎల్‌ఐ) పథకం కిం ద చేపడుతున్న కర్వెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లను, ఈ రిజర్వాయర్ల నిర్మాణ ప నులకు ఒండ్రు మట్టిని తరలిస్తున్న చెరువులను పరిశీలించారు. ముందుగా బృందం సభ్యులు ఆరోక్య లెనిన్‌, పూర్ణిమ, విజయరామరాజు, మేగనాథన్‌, రమేష్‌కుమార్‌, ఎ ల్బీ మునుతాంగ్‌ కర్వెన రిజర్వాయర్‌ వద్దకు చేరుకున్నారు. 13వ ప్యాకేజీ వద్ద ప్రతి మ కంపెనీలో జిల్లా ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం అయ్యారు. రిజర్వాయర్‌ను ఎందుకు నిర్మిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నక్షాను పరిశీలించారు. అక్కడి నుంచి ఉదండాపూర్‌ రిజ ర్వాయర్‌ వద్దకు చేరుకున్నారు. పర్యావరణానికి సంబంధించిన వివరాలను కలెక్టర్‌ వెంకట్రావును అడిగి తెలుసుకొని, పథకం నక్షాను పరిశీలించారు. అక్కడి నుంచి నవాబ్‌పేట మండలం యన్మన్‌గండ్ల పెద్ద చెరు వును పరిశీలించారు. చెరువు సామర్థ్యం, చెరువు శిఖం, కట్ట నాణ్యత, మట్టి వివరా లు అడిగి తెలుసుకున్నారు. జడ్చర్ల మండలానికి చేరుకొని, నసరుల్లాబాద్‌ చెరువులో నుంచి ఒండ్రు మట్టిని కర్వెన ప్రాజెక్ట్‌కు తరలించిన అంశంతో పాటు, పోలేపల్లి రం గనాయక చెరువు నుంచి ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి తరలించిన ఒం డ్రు మట్టి అంశాలపై ఆరా తీశారు. చెరువులలో నిబంధనల మేరకు ఒండ్రును త రలించారా? నిబంధనలకు విరుద్ధంగా తోడారా? అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బృందం వెంట కలెక్టర్‌ వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, ఇరిగేషన్‌ శాఖ సీఈ రమేష్‌, ఎస్‌ఈ నర్సింగరావు, భూత్పూర్‌, జ డ్చర్ల, నవాబ్‌పేట తహసీల్దార్లు చెన్నకిష్టన్న, లక్ష్మీ నారాయణ, రాజేందర్‌రెడ్డి ఉన్నారు.

కాగా, ఈ చెరువులలోని ఒండ్రును నిబంధనలకు విరుద్ధంగా తరలించిన అంశా లపై ‘ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలను ప్రచురితమయ్యాయి. ఈ చెరువులలోని ఒం డ్రు తరలింపులో కాంట్రాక్టర్‌తో పాలకులు, అధికారులు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి. ఈ అంశాలు జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ బృందం ఆరా తీసిందా? లేదా? అనే అశం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2021-09-17T04:38:39+05:30 IST