ఎన్జీటీలో ఏపీకి చుక్కెదురు

ABN , First Publish Date - 2020-07-14T02:30:07+05:30 IST

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం అంశంపై ఎన్జీటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై స్టే ఎత్తివేయడానికి ఎన్జీటీ నిరాకరించింది.

ఎన్జీటీలో ఏపీకి చుక్కెదురు

న్యూఢిల్లీ: పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం అంశంపై ఎన్జీటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై స్టే ఎత్తివేయడానికి ఎన్జీటీ నిరాకరించింది. టెండర్లు పిలిచినా తుది ఆదేశాలు వచ్చేంత వరకు పనులు చేపట్టవద్దని ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో పర్యావరణ అనుమతులకు సంబంధించి ఆగస్టు 11వ తేదీలోగా నివేదిక సమర్పించాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలను ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది. కాగా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన ఎన్జీటీ ధర్మాసనం ప్రాజెక్టులో ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టవద్దంటూ స్టే విధించింది.

Updated Date - 2020-07-14T02:30:07+05:30 IST