ఎన్జీవోల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-04-13T05:21:16+05:30 IST

ఎన్జీవోలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నెల్లూరులోని ఎన్జీవో సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎన్జీవోల సమస్యల పరిష్కారానికి కృషి
విలేకరులతో మాట్లాడుతున్న చంద్రశేఖర్‌రెడ్డి

ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి 

నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్‌ 12 :  ఎన్జీవోలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామని  ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నెల్లూరులోని ఎన్జీవో సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 27శాతం ఐఆర్‌ ఇచ్చారని, 2018 జూలై 1 నుంచి 55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అడుగుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి మెరుగైన పీఆర్సీ ఇస్తారని నమ్ముతున్నామన్నారు. నాల్గో తరగతి ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాల విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని  డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీఆర్సీ శేఖర్‌రావు, కార్యదర్శి ఆంజనేయవర్మ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మన్నేపల్లి పెంచలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:21:16+05:30 IST