నెయ్‌మార్‌ సాయం రూ. 7.6 కోట్లు!

ABN , First Publish Date - 2020-04-05T09:49:38+05:30 IST

కొవిడ్‌-19 మహమ్మారిపై పోరుకు బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ నెయ్‌మార్‌ తనవంతు సాయం చేశాడు. ఈ వైర్‌సతో పోరాడుతున్న తన సొంత దేశాన్ని ...

నెయ్‌మార్‌ సాయం రూ. 7.6 కోట్లు!

బ్రెజిలియా: కొవిడ్‌-19 మహమ్మారిపై పోరుకు బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ నెయ్‌మార్‌ తనవంతు సాయం చేశాడు. ఈ వైర్‌సతో పోరాడుతున్న తన సొంత దేశాన్ని ఆదుకునేందుకు నెయ్‌మార్‌ ఏకంగా రూ.7.64 కోట్ల భారీ విరాళం అందజేసినట్టు స్థానిక టీవీ నెట్‌వర్క్‌ ఎస్‌బీటీ వెల్లడించింది. ఈ విరాళంలో భాగంగా కొంత మొత్తం అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసె్‌ఫ)కి, మిగతాది తన స్నేహితుడు లూసియానో హక్‌ నిర్వహిస్తున్న చారిటబుల్‌ ట్రస్ట్‌కు ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా మూడో అత్యధిక పారితోషికం అందుకునే సాకర్‌ ప్లేయర్‌గా ఖ్యాతికెక్కిన నెయ్‌మార్‌.. ఇటీవల తన లగ్జరీ విల్లాలోని బీచ్‌ వాలీబాల్‌ కోర్టులో స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి విమర్శల పాలయ్యాడు. ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్‌ ధాటికి విలవిల్లాడుతుంటే.. ఇవేమీ పట్టించుకోకుండా నెయ్‌మార్‌ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ బిజీగా ఉన్నాడంటూ నెటిజన్లు కడిగిపారేశారు. 

Updated Date - 2020-04-05T09:49:38+05:30 IST