వచ్చే వారంలో యూనివర్సిటీలో హాస్టళ్లను తెరుస్తాం

ABN , First Publish Date - 2021-09-06T21:57:47+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లను కూడా వచ్చే వారంలో తెరుస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ప్రతి యూనివర్సిటీలో నూతన హాస్టల్ భవనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు..

వచ్చే వారంలో యూనివర్సిటీలో హాస్టళ్లను తెరుస్తాం

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లను కూడా వచ్చే వారంలో తెరుస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ప్రతి యూనివర్సిటీలో నూతన హాస్టల్ భవనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ యూనివర్సిటీల్లో విద్యాబోధన చేస్తామని వెల్లడించారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని ఎప్పుడు దెబ్బతీయడం లేదని చెప్పారు.  అధ్యాపకుల నియామకంలో కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలపై స్టడీ చేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ బి క్యాటగిరి సీట్ల భర్తీలో అవకతవకలు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. సీట్లు అమ్ముకున్నట్లే తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లింబాద్రి హెచ్చరించారు.


Updated Date - 2021-09-06T21:57:47+05:30 IST