ముంబై: పుణెకు చెందిన విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ నెక్స్‌జూ మొబిలిటీ తన ఈ-సైకిల్ శ్రేణిని మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా ‘బజింగ’ పేరుతో ఈ-సైకిల్‌ను ఆవిష్కరించింది. ఇందులో కమ్యూటర్ వెర్షన్ ధర రూ.49,445 ఉండగా.. కార్గో వెర్షన్ ధర రూ.51,525గా ఉంది. వచ్చే నెలలో ఈ బైక్‌లను విడుదల చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.