న్యూజిలాండ్‌ ప్రధానికి కొవిడ్‌

ABN , First Publish Date - 2022-05-16T12:01:41+05:30 IST

న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డర్న్‌ కొవిడ్‌ బారినపడ్డారు. ఆదివారం ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. జసిండా ప్రస్తుతం తేలికపాటి కొవిడ్‌ లక్షణాలతో బాధపడు

న్యూజిలాండ్‌ ప్రధానికి కొవిడ్‌

వెల్లింగ్టన్‌, మే 15: న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డర్న్‌ కొవిడ్‌ బారినపడ్డారు. ఆదివారం ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. జసిండా ప్రస్తుతం తేలికపాటి కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారని, వారం పాటు ఆమె ఐసొలేషన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు. టెలివిజన్‌ ప్రజెంటర్‌ క్లార్క్‌ గేఫోర్డ్‌.. కరోనా బారిన పడినప్పటి నుంచి జసిండా ఐసోలేషన్‌లోకి వెళ్లారని చెప్పారు. కాగా జసిండా కూడా తనకు కొవిడ్‌ వచ్చిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. పాజిటివ్‌ పరీక్షకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు.


Updated Date - 2022-05-16T12:01:41+05:30 IST