పురిటి నొప్పులతో సైకిల్ తొక్కుతూ ఆస్పత్రికి.. ఆమె ఒక ప్రజాప్రతినిధి

ABN , First Publish Date - 2021-11-29T12:25:50+05:30 IST

ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ మీద వెళ్లి.. ఓ మహిళ వార్తల్లో నిలిచింది. ఆమె న్యూజిలాండ్‌కు చెందిన ఒక ప్రజా ప్రతినిధి. న్యూజిలాండ్‌ ఎంపీ జూలీ అన్నె ఇటీవలే ఒక పండంటి పాపాకు జన్మనిచ్చారు. ఆమె తన ప్రసవానికి ఆర్ధరాత్రి ముందు సైకిల్ తొక్కుతూ ఆస్పత్రికి

పురిటి నొప్పులతో సైకిల్ తొక్కుతూ ఆస్పత్రికి.. ఆమె ఒక ప్రజాప్రతినిధి

ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ మీద వెళ్లి.. ఓ మహిళ వార్తల్లో నిలిచింది. ఆమె న్యూజిలాండ్‌కు చెందిన ఒక ప్రజా ప్రతినిధి. న్యూజిలాండ్‌ ఎంపీ జూలీ అన్నె ఇటీవలే ఒక పండంటి పాపాకు జన్మనిచ్చారు. ఆమె తన ప్రసవానికి ఆర్ధరాత్రి ముందు సైకిల్ తొక్కుతూ ఆస్పత్రికి వెళ్లింది. ఆమె స్వయంగా ఈ విషయం తన ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం నెటిజెన్లు ఆమె రాసిన తన ప్రసవ వేదనని తెగ చదివేస్తున్నారు. 


అయితే జూలీ అన్నె ఇలా సైకిల్ తొక్కడం మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా తన మొదటి బిడ్డ పుట్టినప్పుదు ఆమె ఇలాగే సైకిల్ తొక్కుతూ ఆస్పత్రికి చేరుకుంది. తనకు రెండోసారి బిడ్డపుట్టిన విషయాన్నీ సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తూ.. "ఆదివారం ఉదయం 3.04 గంటలకు మేము మా కుటుంబం సరికొత్త సభ్యురాలికి స్వాగతం పలికాం, అంతేకాదు లేబర్‌ పెయిన్స్ వస్తున్న సమయంలో  సైకిల్ తొక్కాలని నిజంగా అనుకోలేదు.. అయితే అలా అనుకోకుండా జరిగింది" అని ఆమె చెప్పారు.




తాను హాస్పిటల్‌కి వెళ్లడానికి తెల్లవారుజామున 2 గంటలకు సైకిల్ మీద బయలు దేరినప్పుడు తనకు అంతగా నొప్పులు రాలేదని.. అయితే కొంత దూరం వెళ్లిన నొప్పుల తీవ్రత పెరిగిందని చెప్పారు. ఆసుప‌త్రికి వెళ్లిన గంట‌కే త‌న‌కు వైద్యులు డెలివ‌రీ చేశారని చెప్పారు. త‌న‌కు పాప పుట్ట‌గానే.. త‌ను సైకిల్ మీద ఆసుప‌త్రికి వెళ్లిన విష‌యాన్ని ఫోటోల‌తో స‌హా.. జూలీ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.


అంతేకాదు ఇప్పుడు తాను తన బిడ్డ ఇద్దరం ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామని.. పాప తన తండ్రి ఒడిలో హాయిగా నిద్రపోతుందని  ఫోటోలను షేర్ చేస్తూ.. క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఈ పోస్ట్‌కి నెటిజన్ల నుండి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. కొంతమంది  పాప పుట్టినందుకు సంతోషం వ్యక్తం చేయగా, మరికొందరు సైక్లింగ్ నుండి వ్యాయామం చేయడం వల్ల డెలివరీ సమయంలో చాలా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. 

Updated Date - 2021-11-29T12:25:50+05:30 IST