అపరిమిత సెలవులు.. ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్..!

ABN , First Publish Date - 2022-05-02T03:25:26+05:30 IST

కంపెనీల్లో సెలవులు అంటే.. నెలకు ఒకటో రెండో ఉంటాయి. సంవత్సరం మొత్తం మీద నెల రోజుల సెలవులు ఉంటే గొప్పే. ఈ సెలవులన్నీ వాడేసుకున్నాక ఆఫీసుకు రాకపోతే జీతం కట్టైపోతుంది. కానీ న్యూజిల్యాండ్‌కు చెందిన యాక్షన్ స్టెప్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మాత్రం..

అపరిమిత సెలవులు.. ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్..!

ఎన్నారై డెస్క్: కంపెనీల్లో సెలవులు అంటే.. నెలకు ఒకటో రెండో ఉంటాయి. సంవత్సరం మొత్తం మీద నెల రోజుల సెలవులు ఉంటే గొప్పే. ఈ సెలవులన్నీ వాడేసుకున్నాక ఆఫీసుకు రాకపోతే జీతం కట్టైపోతుంది. కానీ న్యూజిల్యాండ్‌కు చెందిన యాక్షన్ స్టెప్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మాత్రం తన ఉద్యోగులు తాజాగా అపరిమిత సెలవులు ప్రకటించింది. ఉద్యోగులకు కావాల్సినన్ని సెలవులు ఇస్తే..ఆఫీసుకు వచ్చాక వారు మరింత ఇష్టంగా పనిలోనిమగ్నమవుతారనే ఉద్దేశ్యంతోనే ఈ విధానం ప్రవేశపెట్టినట్టు సంస్థ ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు. అయితే.. వీలైనంత వరకూ నాలుగు వారాలకు మించి లీవులు తీసుకోవద్దని సూచించారు.    

Updated Date - 2022-05-02T03:25:26+05:30 IST