Abn logo
May 16 2020 @ 20:53PM

‘పుష్ప’లో స్పెషల్ సాంగ్‌పై అప్పుడే వార్తలొస్తున్నాయ్..

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం అన్నీ బాగుంటే.. ఇప్పటికే సెట్స్‌పై ఉండేది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్ ఆగిపోయింది. ‘రంగస్థలం’ తర్వాత మరో సినిమా చేయని సుకుమార్ ఈ సినిమా కోసం ఎన్నో కసరత్తులు చేశారు. ముందు మహేష్‌తో అనుకుంటే అది వర్కవుట్ అవ్వలేదు. దీంతో అదే కథను బన్నీకి వినిపించి ఓకే చేయించుకున్న సుక్కు.. రీసెంట్‌గా చిత్ర టైటిల్‌తో పాటు బన్నీ లుక్‌ను కూడా వదిలారు. ఈ టైటిల్, లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో ఉండే స్పెషల్ సాంగ్ గురించి హాట్ హాట్‌గా ఫిల్మ్‌నగర్‌లో చర్చలు జరుగుతున్నాయి.


బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఇందులో బన్నీతో స్పెషల్ సాంగ్ చేయనుంది. చిత్రయూనిట్ కూడా ఈ సాంగ్‌తోనే షూటింగ్ మొదలెట్టాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి సంగీత దర్శకుడు దేవిశ్రీ మాస్ మసాలా ట్యూన్స్ రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. దేవిశ్రీ, సుక్కు కాంబినేషన్‌లో స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఈ సినిమాలో ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్‌లో ఉండనుందని టాక్. అలాగే ఈ సాంగ్ జానపద నేపథ్యంలో ఉండనుందని అంటున్నారు. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ పాట తయారైందని, అన్ని భాషలలోను ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమంటూ అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు సంచరిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement