మార్చిలోగా ఎల్‌ఐసీ ఐపీఓ పక్కా

ABN , First Publish Date - 2022-01-14T09:30:06+05:30 IST

మార్చిలోగా ఎల్‌ఐసీ ఐపీఓ పక్కా

మార్చిలోగా ఎల్‌ఐసీ ఐపీఓ పక్కా

రూ.90,000 కోట్ల సమీకరణ లక్ష్యం


న్యూఢిల్లీ : భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) బాహుబలి పబ్లిక్‌ ఇష్యూకి రంగం సిద్ధమవుతోంది. ఆరు నూరైనా ఈ ఏడాది మార్చిలోగా ఈ ఐపీఓ పూర్తి చేస్తామని అధికార వర్గాలు చెప్పాయి. ఈ నెలాఖర్లో లేదా ఫిబ్రవరి మొదటి వారానికల్లా ఇందుకోసం సెబీకి దరఖాస్తు చేయబోతున్నట్టు తెలిపాయి. దీంతో ఎల్‌ఐసీ ఐపీఓ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో మార్కెట్‌కు రాకపోవచ్చన్న వార్తలకు తెరపడింది. ఎల్‌ఐసీ ఇష్యూ ద్వారా ప్రభుత్వం రూ.90,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. 


భారత ఐపీఓ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత భారీ ఐపీఓ మార్కెట్‌కు రాలేదు. ఐపీఓ తర్వాత రూ.15 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో ఎల్‌ఐసీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తర్వాత రెండో అతి పెద్ద కంపెనీగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. 

Updated Date - 2022-01-14T09:30:06+05:30 IST