Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిట్‌కాయిన్‌ ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్‌

ఇండియా ఐఎన్‌ఎక్స్‌తో టోరస్‌ క్లింగ్‌ ఒప్పందం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బీఎ్‌సఈకి చెందిన తొలి ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజీ ‘ఇండియా ఐఎన్‌ఎక్స్‌’తో టోరస్‌ క్లింగ్‌ బ్లాక్‌చెయిన్‌ ఐఎ్‌ఫఎ్‌ససీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌కు చెందిన క్లింగ్‌ ట్రేడింగ్‌ ఇండియా, కాస్మియా ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ (సీఎ్‌ఫహెచ్‌) సంయుక్తంగా టోరస్‌ క్లింగ్‌ను ఏర్పాటు చేశాయి. ఇండియా ఐఎన్‌ఎక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా దేశీయంగా తొలిసారిగా బిట్‌కాయిన్‌, ఎథరియమ్‌ ఫ్యూచర్స్‌, ఈటీఎఫ్‌ ట్రేడింగ్‌ను టోరస్‌ క్లింగ్‌ ప్రారంభించనుంది. అమెరికాకు వెలుపల తొలి క్రిప్టో ఆధారిత ఈటీఎఫ్‌ ఫ్యూచర్స్‌ ఇదేనని కంపెనీ పేర్కొంది. రెగ్యులేటరీ అనుమతులకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈటీఎ్‌ఫను ప్రారంభించనున్నామని టోరస్‌ క్లింగ్‌ బ్లాక్‌చెయిన్‌ ఐఎ్‌ఫఎ్‌ససీ సీఈఓ కృష్ణ మోహన్‌ మీనవల్లి తెలిపారు. మొదటి రెండేళ్లలో 100 కోట్ల డాలర్ల ఏయూఎం లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నామని చెప్పారు. 

Advertisement
Advertisement