Abn logo
May 16 2020 @ 17:42PM

నితిన్ పెళ్లి అప్పుడేనా.. త్వరలో ప్రకటన రానుందా!?

ప్రపంచాన్ని వణికించేస్తోన్న కరోనా వైరస్‌తో ఎన్నో కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఒక్కటికాదు.. అదీ ఇదీ అని చెప్పలేం.. అన్నింటికీ తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే.. సెలబ్స్ ప్రధానమైన వేడుకలు వాయిదా పడ్డాయి. అందులో భాగంగా టాలీవుడ్ హీరోల పెళ్లిళ్లు ఇప్పటికే ఎంతో మందివి వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు యంగ్ హీరో నిఖిల్ వివాహం అయితే అయిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ మహేష్ పెళ్లి చేసుకున్నారు. 


ఈ కరోనా లాక్ డౌన్ కాలంలో పెళ్లిళ్లు ఏంటి.. అంత ఆగలేకపోతున్నారా? అంటూ నటీమణి మాధవీలత బహిరంగంగా పోస్ట్ కూడా పెట్టేసింది. మొత్తానికి పెళ్లి తంతుపై అలా డిస్కషన్స్ జరుగుతున్నాయన్నమాట. నిజానికి నిఖిల్ పెళ్లి ఏప్రిల్‌లో కావాల్సింది కానీ కరోనా నేపథ్యంతో వాయిదా పడింది. అన్నీ కుదరడంతో ఈ మధ్యనే సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తూ నిరాడంబరంగా అతి కొద్ది మంది సమక్షంలో జరుపుకున్నారు.


అయితే ఇక నిఖిల్ త‌ర‌హాలోనే హీరో నితిన్ దుబాయ్‌లో ఏప్రిల్ 16న డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌ని అనుకున్నారు. కానీ.. క‌రోనా దెబ్బకు ఆ ప్లాన్ కాస్తా తారుమారైంది. త‌న వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నానని నితిన్ స్పష్టం చేశారు. తాజా స‌మాచారం ప్రకారం నితిన్ త‌న వివాహాన్ని డిసెంబ‌ర్‌కు వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. త్వర‌లోనే నితిన్ ప్రక‌ట‌న చేయ‌నున్నట్టు సమాచారం. కాగా హీరో రానా వివాహం కూడా డిసెంబ‌ర్‌లో జ‌ర‌పనున్నామని సురేష్‌బాబు తెలిపిన విషయం విదితమే.

Advertisement
Advertisement
Advertisement