- రూ. 5వేల కోట్ల టార్గెట్..
- భాగ్యనగరంలో ఈ ఏడాది మద్యం అమ్మకాలు
- ఇప్పటి వరకు రూ. 1,600 కోట్ల విక్రయాలు
- పెరిగిన ధరలతో 40శాతం అధిక ఆదాయం
హైదరాబాద్ సిటీ : మద్యం ధరల (liquor Rates) పెంపుతో సర్కారు ఖజానాకు గతేడాదితో పోలిస్తే 40శాతానికి మించి ఆదాయం జమ కానుంది. 2021లో రూ. 3,666 కోట్లు అమ్మకాలు జరిగాయి. ఏటా సగటున 20నుంచి 25 శాతం మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆయా గణాంకాల ప్రకారం చూస్తే ఈ ఏడాది నగరంలో మద్యం అమ్మకాలు 20శాతం పెరిగితే ఆదాయం రూ.4,400 కోట్లు దాటే అవకాశముంది. ఇప్పటి వరకు అయిన అమ్మకాలు రూ.1,600 కోట్లు. అంటే ఈ ఏడాది చివరి వరకు రూ. 2,800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగే అవకాశముంది. ఈ లెక్కన రూ.2,800 కోట్ల అమ్మకాలకు పెరిగిన 20శాతం ధరలను జోడిస్తే అదనంగా రూ. 560 కోట్లు వసూలయ్యే అవకాశముంది. అంటే ఈ మిగిలిన ఏడాదిలో సుమారు రూ. 3,400 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశాలున్నాయి. దాంతో ఈ ఏడాది మొత్తంలో రూ. 5వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగే అవకాశముంది.