ఫిట్‌నెస్‌ అంటే Mekapati Gowtham కు ప్రాణం.. ఆజానుబాహుడిగా ఆకర్షణ..

ABN , First Publish Date - 2022-02-22T13:08:35+05:30 IST

మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి జిమ్‌ అంటే ఆరో ప్రాణం అని చెబుతారు...

ఫిట్‌నెస్‌ అంటే Mekapati Gowtham కు ప్రాణం.. ఆజానుబాహుడిగా ఆకర్షణ..

  • రోజూ జిమ్‌లో గంటసేపు కసరత్తులు 
  • గుండెపోటు వార్తపై సర్వత్రా విస్మయం

హైదరాబాద్ సిటీ : మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి జిమ్‌ అంటే ఆరో ప్రాణం అని చెబుతారు. ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా సరే ఉదయం, సాయంత్రం గంట నుంచి రెండు గంటల సేపు ఆయన జిమ్‌లో గడిపేవారు. అందుకు అనుగుణంగా నెల్లూరు, హైదరాబాద్‌లలోని తన నివాసాల్లోనే జిమ్‌ కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకున్నారు. జిమ్‌ ఎలా చేయాలి? ఎంత సేపు చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?.. ఈ విషయాలు చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ట్రైనర్‌ను నియమించుకున్నారు. గౌతమ్‌ రెడ్డి ఎక్కడ కనిపించినా చాలా కళ్లు ఆయన్ను ప్రత్యేకంగా గమనిస్తాయి. దానికి కారణం ఆయన శరీరాకృతి. ఆరడుగుల పొడవు, కండలు తిరిగిన దేహదారుఢ్యంతో ఠీవిగా కనిపించేవారు. గౌతమ్‌రెడ్డి ఆహార ప్రియుడు అనే ప్రచారం ఉంది. ఎంత తింటారో అంత ఖర్చు చేసేవరకు జిమ్‌ రూమ్‌ వదలి బయటకు రారని, అందుకే ఆయన అంత ఫిట్‌గా ఉండేవారని అనుచరులు చెబుతారు. సోమవారం ఉదయం గౌతమ్‌రెడ్డికి గుండెపోటు వచ్చిందనే వార్తను ప్రజలు నమ్మలేకపోయారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు మొదట ఏ గౌతమ్‌రెడ్డికి..? అంటూ ఆరా తీశారు. ఆయనకు గుండెపోటు రావడం ఏమిటీ..!? అంటూ నమ్మలేదు. కొంత సేపటికి అన్ని టీవీల్లో గుండెపోటుతో మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి అనే వార్తలు ప్రసారం కావడంతో నిర్ఘాంతపోయారు.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2022-02-22T13:08:35+05:30 IST