Advertisement
Advertisement
Abn logo
Advertisement

Gang Rape నిందితుల అరెస్ట్‌.. అసలేం జరిగింది.. నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి..!

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : మైనర్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఆటో డ్రైవర్‌ కిరణ్‌ (22), సల్మాన్‌ (23), లింగాచారి(25), షేక్‌ ఫారూక్‌ (28), మహ్మద్‌ ఇర్ఫాన్‌ (24)లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుల్తాన్‌బజార్‌ పోలీసులు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. అంబర్‌పేటకు చెందిన ఆటోడ్రైవర్‌ కాలేజీకి వెళ్తున్న బాలిక(17)కు మాయమాటలు చెప్పి గత నెల 30న మూసీ పరీవాహక ప్రాంతంలోని గడ్డిఏపుగా ఉన్న స్థలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 


రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున బాలికను వదిలేసి వచ్చాడు. తర్వాత రోజు అంబర్‌పేట్‌ పరిసర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బండ్లగూడకు చెందిన మరో యువకుడు సైతం బాలికను నగర శివారు ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. నాలుగు రోజుల అనంతరం చాదర్‌ఘాట్‌లో పోలీసుల కంట పడిన బాలిక తొలుత నోరు విప్పలేదు. రెండు రోజుల తర్వాత జ్వరం రావడంతో భరో సా సెంటర్‌కు తరలించారు. అక్కడ తనపై జరిగిన ఘోరాన్ని బయటపెట్టింది. బాలిక చెప్పిన వివరాల మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నింది తులు నేరం అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement