మార్కెట్‌ కమిటీల భర్తీ ఎన్నడో..?

ABN , First Publish Date - 2020-08-02T10:17:52+05:30 IST

మార్కెట్‌ కమిటీల భర్తీ ఎన్నడో..?

మార్కెట్‌ కమిటీల భర్తీ ఎన్నడో..?

జిల్లాలో ఆరు మార్కెట్లకు పాలక వర్గాలు కరువు

భర్తీపై చొరవ చూపని గులాబీ ముఖ్య నేతలు

ద్వితీయ శ్రేణి నాయకుల ఎదురుచూపులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో పలు నామినేటెడ్‌ పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చే యడంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నేత లు చొరవ చూపడం లేదు. వాటిపై ఆశ లుపెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకు లు పడిగాపులు కాస్తున్నారు. జిల్లా లోని 8 మార్కెట్‌ కమిటీలకు 6 కమిటీలకు పాలక వర్గాలు లేకపో వడం గమనార్హం. ఏడాదిగా వీటిని భర్తీ చేయకపో వడంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. 


జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి, జూలపల్లి, సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌, మంథని ని యోజకవర్గంలో మంథని, కమాన్‌పూర్‌, రామగుండం నియో జకవర్గంలో రామగుండం, ధర్మపురి నియోజకవర్గంలో ధర్మారం మార్కె ట్‌ కమిటీలు ఉన్నాయి. కమాన్‌పూర్‌, ధర్మారం మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను నియమించగా, నూతనంగా ఏర్పడ్డ రామగుండం మా ర్కెట్‌ కమిటీని ఎంపికచేసి ప్రభుత్వానికి పంపించినప్పటికీ అధికారిక ప్రకటన వెలువడ లేదు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ఒక్క మార్కెట్‌ కమిటీని కూడా వేయకపోవడంతో గులాబీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమిటీలపై చాలా మంది ఆశలు పెంచు కున్నారు. పెద్దపల్లి కమిటీ చైర్మన్‌ పదవిని ఎస్టీలకు, సుల్తానాబాద్‌ కమిటీ చైర్మన్‌ పదవిని జనరల్‌కు, జూలపల్లి కమిటీ చైర్మన్‌ పదవిని జనరల్‌కు, కాల్వశ్రీరాంపూర్‌ చైర్మన్‌ పదవిని జనరల్‌ మహిళకు, మం థని మార్కెట్‌ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళలకు కేటాయించారు. ఈ కమిటీలకు గతంలో ఉన్న పాలకవర్గాల పదవీకాలం పూర్తయి ఏడాది గడుస్తున్నా నూతన కమిటీలకు మోక్షం లభించలేదు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవులపై ఆశలు పెంచుకున్నారు. నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. 


తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం మార్కెట్‌ కమిటీల చైర్మన్‌ పదవు లకు రిజర్వేషన్ల విధానాన్ని తీసుకవచ్చింది. వాటిని రొటేషన్‌ పద్ధతిలో మారుస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన నాటినుంచి జిల్లాలో కమాన్‌పూర్‌, ధర్మారం మినహా మిగతా కమిటీల కు ఒక్కసారే కమిటీలను నియమించింది. కమిటీల పదవీకాలం ఏడాదికాలమే అయినా 6 మాసాల చొప్పున రెండుసార్లు పొడిగిస్తూ పోయారు. ఆ తర్వాత కమిటీలను పొడిగించలేదు. దాదాపు 2018 సం వత్సరంలో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పదవీ కాలాలు ముగిశాయి. 2018లో చివరలో అసెంబ్లీ ఎన్నికలు, 2019 ప్రారంభంలో గ్రామపంచాయతీ ఎన్నికలు, తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలు, అనంతరం మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గులాబీ నేతలంతా మునిగితేలడంతో మార్కెట్‌ కమిటీల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాతనైనా కమిటీలను నియమిస్తారని ద్వితీయ శ్రేణి నేతలు ఆశలు పెంచుకున్నప్పటికీ, కమిటీలు ముందుకు సాగ లేదు. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్‌ ఎన్నికలు, తర్వాత సహకార సంఘాల ఎన్నికలు జరగగా, మార్చిలో కరోనా ఉధృతి పెరిగి పరిస్థి తులు లాక్‌డౌన్‌కు దారితీశాయి. లాక్‌డౌన్‌కు ముందు పలు మార్కెట్‌ కమిటీలను భర్తీ చేసినప్పటికీ, పెద్దపల్లి, జూలపల్లి, సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌ కమిటీలను భర్తీచేసే బాధ్యత ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిపై ఉండగా, మంథని మార్కెట్‌ కమిటీని భర్తీ చేసే బాధ్య త జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌పై ఉన్నది. ఆశావహులంతా వారిపై ఆశలు పెంచుకున్నారు. ఎప్పడికప్పుడు కమిటీలను భర్తీ చేయకపోవ డంతో గులాబీ నేతలను అవకాశాలను కోల్పోతున్నారు. ఇప్పటికైనా మార్కెట్‌ కమిటీల భర్తీపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-08-02T10:17:52+05:30 IST