సింగరేణి సర్పంచ్‌ ఆత్యహత్యాయత్యం

ABN , First Publish Date - 2020-08-02T10:03:28+05:30 IST

సింగరేణి సర్పంచ్‌ ఆత్యహత్యాయత్యం

సింగరేణి సర్పంచ్‌ ఆత్యహత్యాయత్యం

కారేపల్లి ఆగస్టు 1: మండలంలోని మండల కేంద్రమైన సింగరేణి సర్పంచ్‌ అదేర్ల స్రవంతి శనివారం ఆత్మహత్యకు యత్నించింది. ఉదయం ఇంట్లో ప్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా కుటుంబ సభ్యులు గమనించి కాపాడారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సింగరేణి పంచాయతీలో అనేక అక్రమాలు జరిగినట్లు పలువురు వార్డు సభ్యులు ఇప్పటికే కలెక్టర్‌ను కలిశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, డీపీవో శ్రీనివాస్‌రెడ్డిని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో ఆయన కల్లూరు డీఎల్‌పీవో ప్రభకర్‌ను విచారణ అధికారిగా నియమించారు. రెండుసార్టు విచారణ చేసిన సదరు అధికారి పంచాయతీలో రూ.28లక్షల మేర అక్రమాలు జరిగిన్నట్లు నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు.  గత బుధవారం మరోసారి డీపీవో శ్రీనివస్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ సమయంలో పలువురు వార్డు సభ్యులు, అఖిలపక్షకమిటీ నాయకులు పంచాయతీలో జరిగిన అక్రమాలపై న్యాయవిచారణ జరిపించాలని కోరారు. ఇదే డిమాండ్‌పై 4వ తేదీ నుంచి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యలో నిరహర దీక్షలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపద్యంలో సర్పంచ్‌ స్రవంతి ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-08-02T10:03:28+05:30 IST