వైద్యపరమైన చికిత్స నిమిత్తం వృత్తిపరమైన పనుల నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్టు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. గత వారం అనారోగ్యంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం తర్వాత డిశ్చార్జి అయ్యారు.
రవితేజ ‘కిక్’ను హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేశారు. సల్మాన్ సరసన జాక్వలైన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటించారు. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘కిక్ 2’ అనౌన్స్ చేశారు. సీక్వెల్లో సైతం సల్మాన్, జాక్వలైన్ జంటగా నటించనున్నారు. స్ర్కిప్ట్ లాక్ చేసినట్టు సాజిద్ తెలిపారు.