పోలీస్ స్టేషన్లో నవవధువు.. పెళ్లై వారం కూడా కాకముందే మెడలోని మంగళసూత్రాన్ని తీసి భర్తకు ఇచ్చేసి..

ABN , First Publish Date - 2022-02-11T22:05:42+05:30 IST

పెళ్లై భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లిన నవవధువు.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. వివాహం జరిగి వారం రోజులు కూడా కాకముందే మెడలోని మంగళసూత్రాన్ని తీసి భర్త చేతికి ఇచ్చేసింది. ప్రస్తుతం చ

పోలీస్ స్టేషన్లో నవవధువు.. పెళ్లై వారం కూడా కాకముందే మెడలోని మంగళసూత్రాన్ని తీసి భర్తకు ఇచ్చేసి..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లై భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లిన నవవధువు.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. వివాహం జరిగి వారం రోజులు కూడా కాకముందే మెడలోని మంగళసూత్రాన్ని తీసి భర్త చేతికి ఇచ్చేసింది. ప్రస్తుతం చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


చత్తీస్‌గడ్‌లోని దంతెవాడ‌కు చెందిన ఆర్తి, బస్తర్ ప్రాంతానికి చెందిన వికాస్ గుప్తా చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం ఆర్తి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. దీంతో వికాస్‌తో ఆర్తి పెళ్లి చేసేందుకు వాళ్లు నిరాకరించారు. అంతేకాకుండా మహారాష్ట్రకు చెందిన యువకుడితో ఫిబ్రవరి 6న ఆర్తి వివాహం జరిపించారు. దీంతో భర్తతో కలిసి ఆర్తి తన అత్తారింట్లో అడుగుపెట్టింది. అనంతరం ఈ నవవధువు అత్తింటి వారితోపాటు పుట్టింటి వారికి షాకిస్తూ ఇంట్లోంచి పారిపోయింది. విషయం తెలియడంతో ఆర్తి తల్లిదండ్రులు వికాస్ గుప్తాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వికాస్ గుప్తాపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వికాస్‌ గుప్తాతో కలిసి ఆర్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. 



వికాస్ గుప్తాపై తనకు ఉన్న ఇష్టంతోనే ఇంట్లోంచి వెళ్లిపోయినట్టు ఆర్తి చెప్పడంతో.. అతడిని పోలీసులు విడిచిపెట్టారు. ఆపై స్టేషన్ బయటకు వచ్చిన వికాస్ గుప్తాను ఆర్తి భర్త తరఫు బంధువులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ప్రేమించిన వాడితోనే కలిసి బతుకుతానని పోలీసుల ముందే తల్లిదండ్రులకు ఆర్తి తెగేసి చెప్పి స్టేషన్ బయటకు వచ్చేసింది. అనంతరం వికాస్ గుప్తను తన భర్త బంధువులు చుట్టముట్టి ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేను ప్రేమించిన వాడికి ఎదైనా జరిగితే ఎవ్వరినీ వదలను’ అని హెచ్చరించింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న భర్తకు.. ఆర్తి తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి ఇచ్చేసింది. అనంతరం తాను ప్రేమించిన వికాస్‌ గుప్తాతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. త్వరలోనే ఆర్తి, వికాస్ గుప్తాలు పెళ్లి చేసుకోనున్నట్టు సమాచారం.




Updated Date - 2022-02-11T22:05:42+05:30 IST