నూతన వధూవరులు సత్యనారాయణ స్వామి వ్రతం (పూజ) చేయడం తెలుగు కుటుంబాలలో ఓ ఆనవాయితీ. హిందూ సంప్రదాయంలో ఈ సనాతన ఆచారం ప్రకారం కొత్త జంట రానా, మిహీకా ఇటీవల పూజ చేశారు. దగ్గుబాటి వారింట జరిగిన ఈ సత్యనారాయణ స్వామి పూజకు బజాజ్ కుటుంబం హాజరైంది. వియ్యంకులు సురేశ్‌బాబు, సురేశ్ బజాజ్, వెంకటేశ్ పంచెకట్టులో సందడి చేశారు.