viral video: ఇదెక్కడి పిచ్చి రా బాబూ.. పెళ్లి వేడుకలో తమను తాము తగలబెట్టుకున్న వధూవరులు.. అతిథులంతా షాక్!

ABN , First Publish Date - 2022-05-14T15:02:55+05:30 IST

జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.

viral video: ఇదెక్కడి పిచ్చి రా బాబూ.. పెళ్లి వేడుకలో తమను తాము తగలబెట్టుకున్న వధూవరులు.. అతిథులంతా షాక్!

జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. గతంలో లాగా సింపుల్‌గా పెళ్లిళ్లు చేసుకొవడానికి నేటి యువత ఇష్టపడడం లేదు. తమకు, వేడుకకు హాజరైన బంధుమిత్రులకు తమ పెళ్లి ఎల్లకాలం గుర్తుండిపోయేలా చేయడానికి ఊవిళ్లూరుతున్నారు. ఫొటో షూట్ నుంచి మెహందీ, సంగీత్, హల్దీ, అప్పగింతల వరకు ప్రతి వేడుక గ్రాండ్‌గా ఉండలనుకుంటున్నారు. మరికొందరు వెరైటీ పనులు చేసి అతిథులను అలరిస్తున్నారు. 

Viral Video: టీవీ సీరియళ్లా.. మజాకా.. ఈ సీన్ చూసి నవ్వాపుకోగలిగితే గ్రేటే.. సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!




ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ నూతన జంట వెరైటీ స్టంట్‌తో పెళ్లికి హాజరైన వారికి దారుణమైన షాకిచ్చింది. ఆ వీడియో ప్రకారం.. గేబ్ జెస్సోప్, అంబిర్ బేబిర్ అనే కొత్త జంట పెళ్లి వైభవంగా జరిగింది. వీరిద్దరికీ రకరకాల స్టంట్లు అంటే చాలా ఇష్టం. తమ పెళ్లి వేడుకలో కూడా అలాంటి ఓ స్టంట్ చేసి అందరికీ షాకివ్వాలనుకున్నారు. నూతన దంపతులు ప్రత్యేకమైన దుస్తులు ధరించగా.. నిర్వాహకులు వారికి నిప్పంటించారు. శరీరాలపై మంటలు చెలరేగుతుండగా వధూవరులు పరిగెత్తుకుంటూ అతిథుల దగ్గరకు వచ్చారు. దీంతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాసేపటి తర్వాత అది స్టంట్ అని తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Updated Date - 2022-05-14T15:02:55+05:30 IST

Read more