4 రోజుల క్రితం పెళ్లి.. కూరగాయలు తీసుకొస్తానని వెళ్లి ఎంతకూ తిరిగి రాని కొత్త కోడలు.. ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-04-14T22:34:42+05:30 IST

పెళ్లి చేసుకుని భర్తతో కలిసి ఆ నవవధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. పుట్టింటిని వదిలి మెట్టింటికి వచ్చిన ఆమెకు భర్త తరఫు కుటుంబ సభ్యులు ప్రేమగా స్వాగతం పలికారు. ఆమె రాక వరుడి కుటుంబంలో కొత్త

4 రోజుల క్రితం పెళ్లి.. కూరగాయలు తీసుకొస్తానని వెళ్లి ఎంతకూ తిరిగి రాని కొత్త కోడలు.. ఆరా తీస్తే..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చేసుకుని భర్తతో కలిసి ఆ నవవధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. పుట్టింటిని వదిలి మెట్టింటికి వచ్చిన ఆమెకు భర్త తరఫు కుటుంబ సభ్యులు ప్రేమగా స్వాగతం పలికారు. ఆమె రాక వరుడి కుటుంబంలో కొత్త సంతోషాలను నింపింది. ఇలా నాలుగు రోజులు గడిచిపోయాయి. ఈ   క్రమంలోనే కూరగాయలు తీసుకొస్తానని ఆ నవవధువు బయటికెళ్లింది. అలా వెళ్లిన ఆమె.. ఎంతకూ తిరిగి రాలేదు. ఇంతలో వారికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతానికి చెందిన రూప్ చంద్‌కు ప్రస్తుతం 30ఏళ్లు. కంట్రాక్టర్‌గా పని చేస్తున్న ఈ యువకుడు పెళ్లి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే బుధ్ సింగ్ అనే వ్యక్తి 26ఏళ్ల పూజ గురించి చెప్పాడు. ఆమెను చూసి ఇష్టపడ్డ రూప్ చంద్.. పెళ్లికి ఓకే చెప్పేశాడు. దీంతో మార్చి 4న పెళ్లి బంధంతో రూప్ చంద్, పూజ ఒక్కటయ్యారు. వరుడు తరఫు కుటుంబ సభ్యులు మార్చి 6న ఘనంగా రిసెప్షెన్ ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న వధూవరులు కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. అంతా హ్యాపీగా సాగిపోతోంది. ఈ క్రమంలో మార్చి 7న కూరగాయల కోసమని పూజ మార్కెట్‌కు వెళ్లింది. 



అలా వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో రూప్‌చంద్ ఊరంగా గాలించాడు. ఎంతకూ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో అతడికి మరో విషయం తెలిసింది. పూజ వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న డబ్బు, నగలను కూడా ఎత్తుకెళ్లిందని గుర్తించాడు. ఈ క్రమంలో పోలీసులు ఆశ్రయించాడు. అయితే తొలుత పోలీసులు వాళ్ల ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు.. కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 




Updated Date - 2022-04-14T22:34:42+05:30 IST