Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 27 Sep 2021 20:34:34 IST

అత్తారింట్లో తెగ సందడి చేసిన నవవధువు.. 2 నెలల తర్వాత సడన్‌గా అదృశ్యం.. ఊరంతా వెతికిన తర్వాత ఇంట్లోకి వెళ్లి చూస్తే..

twitter-iconwatsapp-iconfb-icon
అత్తారింట్లో తెగ సందడి చేసిన నవవధువు.. 2 నెలల తర్వాత సడన్‌గా అదృశ్యం.. ఊరంతా వెతికిన తర్వాత ఇంట్లోకి వెళ్లి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: తమ కుమారుడిని పెళ్లి చేసుకుని.. ఇంటికొచ్చిన నవవధుకు ఆ అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులు సాదరస్వాగతం పలికారు. ఎంతో అభిమానంగా చూసుకున్నారు. ఆ నవవధువు కూడా అందరితో బాగానే కలిసిపోయింది. తెగ సందడి చేసింది. ఈ క్రమంలోనే రెండు నెలలు గడిచిపోయాయి. అయినా.. పెళ్లి సందర్భంగా ఏర్పడ్డ సందడి ఆ ఇంట్లో ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో అప్పటి వరకూ కలివిడిగా తిరిగిన ఆ నవవధువు.. అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీంతో ఆ ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. ఊరంతా వెతికినా ఆమె జాడ తెలియలేదు. ఈ క్రమంలో తీరా ఇంట్లోకి వెళ్లి చూసిన ఆ కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..


హర్యానాకు చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తికి ఓ మధ్యవర్తి ద్వారా చత్తీస్‌గఢ్‌కు చెందిన ఆర్తి అనే అమ్మాయితో వివాహం కుదురింది. ఈ క్రమంలో సురేష్, ఆర్తి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. తమ కుమారుడిని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టిన ఆర్తికి అత్తామామ, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఎంతో అభిమానంగా చూసుకున్నారు. ఆర్తి కూడా తన మాటలతో అందరితో బాగానే కలిసిపోయింది. కలివిడిగా మెలిగింది. ఇలా రెండు నెలలు గడిచిపోయాయి. ఈ క్రమంలో రాత్రికి రాత్రే ఆర్తి ఒక్కసారిగా అదృశ్యం అయింది. ఆర్తి కనబడకుండా పోవడంతో సురుష్ కుమార్ సహా కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె ఆచూకీ కోసం ఊరంతా తిరిగి చూశారు.


అయినా ఫలితం లేకపోవడంతో నిరాశగా ఇంటికి తిరిగొచ్చారు. అనంతరం ఇంట్లో బీరువా తలుపులు తెరిచి ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రూ.70వేల డబ్బు.. నగలతో ఆర్తి ఉడాయించిందని గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించి ఆర్తిపై ఫిర్యాదు చేశారు. ఓ మధ్యవర్తిని నమ్మి.. ఎటువంటి విచారణ చేయకుండానే ఆర్తితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నట్లు వాపోయారు. దీనిపై సురేష్ కుమార్ స్పందిస్తూ.. ‘మా అమ్మ ఆపరేషన్ కోసం దాచి ఉంచిన డబ్బును ఆర్తి ఎత్తుకెళ్లింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆర్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.