Gift పేలి కొత్తగా పెళ్లైన యువకుడి చెయ్యి పోయింది

ABN , First Publish Date - 2022-05-18T21:09:25+05:30 IST

గాయపడ్డ పెళ్లి కుమారుడి పేరు లాతిష్ గావిట్. మే 12న సల్మాతో వివాహం జరిగింది. కాగా బంధువులు, స్నేహితుల నుంచి వీరి పెళ్లికి పెద్ద ఎత్తునే బహుమతులు అందాయి. లాతిష్ మరదలి పాత బాయ్‌ఫ్రెండ్ కూడా ఒక బహుమతి ఇచ్చాడు..

Gift పేలి కొత్తగా పెళ్లైన యువకుడి చెయ్యి పోయింది

అహ్మాదాబాద్: పెళ్లి, పుట్టిన రోజు వంటి వేడుకల్లో స్నేహితులు, బంధువుల నుంచి బహుమతులు అందుతుంటాయి. తమకు వచ్చిన బహుమతుల్లో ఏముంటుందో అనీ తెరిచి చూడడానికి చాలా మందికి ఆతృత ఉంటుంది. అయితే ఇలాగే పెళ్లికి వచ్చిన ఓ బహుమతి కొత్తగా పెళ్లైన యువకుడి చెయ్య పోగొట్టుకునే వరకు వచ్చింది. అతడితో పాటు అతడి 3 ఏళ్ల మేనల్లుడు సైతం గాయపడ్డాడు. గుజరాత్‌లోని నవ్సారి జిల్లాలో జరిగిందీ ఘటన.


గాయపడ్డ పెళ్లి కుమారుడి పేరు లాతిష్ గావిట్. మే 12న సల్మాతో వివాహం జరిగింది. కాగా బంధువులు, స్నేహితుల నుంచి వీరి పెళ్లికి పెద్ద ఎత్తునే బహుమతులు అందాయి. లాతిష్ మరదలి పాత బాయ్‌ఫ్రెండ్ కూడా ఒక బహుమతి ఇచ్చాడు. అయితే మంగళవారం బహుమతులను తెరిచే కార్యక్రమం పెట్టుకున్నాడు లాతిష్. ఇందులో భాగంగా తన మరదలి ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ బహుమతి తెరుస్తుండగా అది పేలింది. దీంతో లాతిష్, అతడి దగ్గరలోనే ఉన్న 3 ఏళ్ల చిన్నారి గాయపడ్డారు.

Updated Date - 2022-05-18T21:09:25+05:30 IST