కొత్తగా 1800 ఎకరాల్లో కాఫీ సాగు

ABN , First Publish Date - 2021-03-05T06:11:56+05:30 IST

మండలంలో నూతనంగా 1800 ఎకరాల్లో కాఫీ సాగు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఉద్యాన శాఖ అధికారి మత్స్యరాజు తెలిపారు.

కొత్తగా 1800 ఎకరాల్లో కాఫీ సాగు
కాఫీ నర్సరీలను పరిశీలిస్తున్న హెచ్‌వో మత్స్యరాజు


హెచ్‌వో మత్స్యరాజు

చింతపల్లి, మార్చి 4: మండలంలో నూతనంగా 1800 ఎకరాల్లో కాఫీ సాగు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఉద్యాన శాఖ అధికారి మత్స్యరాజు తెలిపారు. గురువారం చౌడుపల్లి కాఫీ నర్సరీని పరిశీలించిన ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. ఐటీడీఏ సహకారంతో 1750 మంది రైతులతో 1800 ఎకరాల్లో కాఫీ సాగు చేపట్టేందుకు అవసరమైన కాఫీ మొక్కలను చౌడుపల్లి, పారికలు, గొందిపాకలు గ్రామాల్లో నర్సరీలు పెంపొందిస్తున్నామన్నారు. కాఫీ బోర్డు, ఆర్‌వీనగర్‌ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచిన చంద్రగిరి, సెలక్షన్‌ 4ఏ, సెలక్షన్‌ 9 రకాలను నర్సరీల్లో పెంచుతున్నట్టు చెప్పారు. వీటిని రైతులకు ఉచితంగా అందజేస్తామన్నారు.  ఈకార్యక్రమంలో కాఫీ సబ్‌అసిస్టెంట్‌ రమణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-05T06:11:56+05:30 IST